పట్నా: బిహార్‌లో బీజేపీ మద్దతుతో జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన సమయం నుంచి రాష్ట్ర స్పీకర్ పదవిపై బీజేపీ, జేడీయూ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. బిహార్‌్ స్పీకర్ పదవి కోసం ఐదుగురు ఆశావహులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ప్రస్తుత స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుత స్పీకర్, ఆర్జేడీ నేత అవధి బిహారీ స్థానంలో బీజేపీ నేతకు అవకాశం ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచే ఐదుగురు స్పీకర్ పదవి కోసం పోటీపడటం గమనార్హం. బీజేపీ పార్టీలోని నందకిషోర్ యాదవ్, నితీష్ మిశ్రా, మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి, సంజయ్ సరోగి, జానక్ సింగ్ స్పీకర్ పదవిని ఆశిస్తున్నారు. అయితే ఫైనల్ నిర్ణయం మాత్రం కేంద్రంలోని బీజేపీ అధిష్టానం చేతిలో ఉందని చర్చ నడుస్తోంది.
నందకిషోర్ యాదవ్: బీసీ సామాజిక వర్గానికి చెందిన నందకిషోర్ గతంలో పలు మంత్రి పదవులను స్వీకరించారు. ఆయన పట్నా సాహిబ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ మేధామిగా.. పార్లమెంటరీ ప్రొసిడింగ్స్‌పైన పట్టు ఉన్న వ్యక్తిగా ఈయనకు మంచి గుర్తింపు ఉంది.
నితీష్ మిశ్రా: మాజీ సీఎం డా. జగన్నాథ్ మిశ్రా కుమారుడు. ఈయనకు కూడా పార్లమెంటరీ ప్రొసిడింగ్స్‌పై పట్టు ఉందనే గుర్తింపు ఉంది. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నితీష్ మిశ్రా.. ఝంఝర్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
సంజయ్ సరోగి: దర్బంగా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈయనకు స్పీకర్ పదవి ఇవ్వాలని పార్టీలో చర్చ జరుగోతంది. మాస్ లీడర్‌గా పేరున్న ఈయన ఉన్నతమైన విద్యార్హతలు కలిగి ఉన్నారు. గత రెండు దశాబ్దాలుగా సంజయ్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఈయన బనియా(వ్యాపార) సామాజకవర్గానికి చెందిన వ్యకి. బీజేపీకి ఈయన సమాజిక వర్గం నుంచి బలమైన ఓటు బ్యాంక్ ఉండటం గమనార్హం.
జానక్ సింగ్: తారణ్య అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఈయన అగ్రవర్ణ కులానికి చెందిన వ్యక్తి. ఈయినకు కూడా పార్లమెంటరీ ప్రొసిడింగ్స్ మంచి పట్టు ఉంది. రాజ్‌పుత్ వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్ పదవి కేటాయించాలని బీజేపీ యోచిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
రేణు దేవి: మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి స్పీకర్ పదవిపై కన్నేశారు. వెనబడిన నోనియా సామాజికవర్గానికి చెందిన ఆమెకు సామాజిక సమీకరణాల దృష్ట్యా స్పీకర్ పదవిని కేటాయిస్తారని బీజేపీలో చర్చ జరుగుతోంది.
ఇక.. ప్రస్తుత ఆర్జేడీ పార్టీకి చెందిన అవధ్ బిహారి ఇప్పటికీ స్పీకర్ పదవికి రాజీనామా చేయలేదు. బీజేపీ పార్టీ అతనిపై అవిశాస్వ తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మానం ద్వారా స్పీకర్ పదవి కోల్పోతే.. బిహార్ చరిత్రలో స్పీకర్ పదవి కోల్పోయిన మొదటి వ్యక్తిగా అవధ్ బిహారి నిలుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment