Bihar: నితీశ్‌ జోకులు.. ప్రధాని నవ్వులు | Bihar CM Nitish Kumar Funny Comments Makes PM Modi Laughter In Aurangabad Rally, Details Inside - Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీని నవ్వించిన నితీశ్‌కుమార్‌

Published Sun, Mar 3 2024 7:22 AM | Last Updated on Sun, Mar 3 2024 1:30 PM

Bihar Cm Nitish Kumar Made Modi Laughter - Sakshi

పాట్నా:  బిహార్‌ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ తన మాటలతో  ప్రధాని మోదీని నవ్వించారు. రాష్ట్రంలోని ఔరంగాబాద్‌లో శనివారం జరిగిన రూ.3 వేల కోట్ల అభివృద్ధి పనుల  ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ, నితీశ్‌కుమార్‌ కలిసి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

ఈ కార్యక్రమంలో నితీశ్‌ మాట్లాడుతూ ‘ఇంతకుముందు మీరు వస్తే నేను మాయమయ్యేవాడిని. కానీ ఇప్పుడు మీతోనే ఉన్నాను. ఇక నేను అటు ఇటు వెళ్లను మీతోనే ఉంటానని మాటిస్తున్నాను’అని అనడంతో మోదీ నవ్వారు. బీజేపీ, జేడీయూ కలిసి పూర్తి ఐదేళ్లు లేకున్నా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు.

ఈ ఏడాది జనవరిలో బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో సంకీర్ణ ప్రభుత్వాన్ని వదిలి పెట్టిన నితీశ్‌ ఎన్డీఏతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిణామం​ తర్వాత రాష్ట్రంలో ప్రధాని మోదీ తొలి పర్యటనకు వచ్చినపుడు నితీశ్‌కుమార్‌ తన మాటలతో పండించిన హాస్యం ఆసక్తికరంగా మారింది. 

ఇదీ చదవండి.. వారణాసి నుంచే మళ్లీ మోదీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement