పాట్నా: మహాకూటమిని వీడి బిహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏతో కలిశారు. ఈ పరిణామంతో సీఎం నితీష్ కుమార్‌పై కాంగ్రెస్ మండిపడింది. నితీష్ కుమార్ ఊసరవెళ్లితో పోటిపడుతున్నారని ఎద్దేవా చేసింది. ' నిత్యం రాజకీయ పొత్తులు పెట్టుకుంటున్న నితీష్ కుమార్ ఊసరవెళ్లికి పోటీ ఇస్తున్నారు' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ట్వీట్టర్ వేదికగా విమర్శించారు. ప్రజల మనోభావాలను నితీష్ దెబ్బతీశారని అన్నారు. ఈ మోసానికి నితీష్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.
బిహార్ సీఎం నితీష్ కుమార్ నేడు రాజీనామా చేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ, జేడీయూ సహా ఇతర పార్టీల సహకారంతో నితీష్ కుమార్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సీఎంగా నితీష్ ఈ రోజు సాయంత్రం మళ్లీ ప్రమాణం చేయనున్నారు.
बार-बार राजनीतिक साझेदार बदलने वाले नीतीश कुमार रंग बदलने में गिरगिटों को कड़ी टक्कर दे रहे हैं।
— Jairam Ramesh (@Jairam_Ramesh) January 28, 2024
इस विश्वासघात के विशेषज्ञ और उन्हें इशारों पर नचाने वालों को बिहार की जनता माफ़ नहीं करेगी।
बिलकुल साफ़ है की भारत जोड़ो न्याय यात्रा से प्रधानमंत्री और भाजपा घबराए हुए हैं और उससे… https://t.co/v47tQ8ykaw
బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ కొత్త కూటమిలో పాల్గొననున్నాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమర్పించి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం.
నితీష్ కుమార్ 2013 నుంచి ఎన్డీయే, మహాఘట్‌బంధన్ మధ్య ఊగిసలాడుతున్నారు. నిత్యం పొత్తులతో జిమ్మిక్కులు చేస్తూ సీఎం పదవిని చేజిక్కించుకుంటూ వచ్చారు. మహాకూటమి నుంచి వైదొలిగి ఎన్డీయేలో చేరిన రెండేళ్లకే చివరిసారిగా 2022లో ఆయన మళ్లీ మహాకూటమిని ఏర్పరిచారు. 2020లో బిహార్‌లో చివరిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సహా స్థానిక పార్టీలతో కలిసి మహాకూటమి పేరుతో ప్రభుత్వం ఏర్పడింది. నితీష్ కుమార్ సీఎం అయ్యారు. మళ్లీ మహా కూటమిని విడిచి ఎన్డీఏ కూటమిలో చేరారు.
ఇదీ చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్
Comments
Please login to add a commentAdd a comment