ఇండియా కూటమి కథ ముగిసింది: నితీశ్‌ కుమార్‌ | Bihar Cm Nitish Kumar Sensational Comments On India Alliance | Sakshi
Sakshi News home page

ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసింది: నితీశ్‌ కుమార్‌

Published Sat, Feb 17 2024 4:30 PM | Last Updated on Sat, Feb 17 2024 5:10 PM

Bihar Cm Nitish Kumar Sensational Comments On India Alliance - Sakshi

పాట్నా: ఎన్డీఏలో చేరి  అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ఇండియా కూటమిపై తొలిసారి స్పందించారు.  శనివారం పాట్నాలో ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసిందని ఎద్దేవా చేశారు.

ఇండియా కూటమి వ్యవహారం ముగిసి చాలా కాలమైందన్నారు. అసలు ఆ కూటమికి ఇండియా అనే పేరు పెట్టడం తనకు ముందునుంచే ఇష్టం లేదని చెప్పారు. వేరే పేరు పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించానన్నారు. బిహార్‌ ప్రజల అభివృద్ధి కోసమే ఎన్డీయేలో చేరానన్నారు. 

కాగా, ఇప్పటికే ఇండియా కూటమిలో పలు పార్టీలు పొత్తులను పట్టించుకోకుండా పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కూటమిలోని కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా సీట్లను తేల్చకపోవడం వల్లే మిగిలిన పార్టీలు  సొంతగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. w ఈ నేపథ్యంలో నితీశ్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.  

ఇదీ చదవండి.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement