
పాట్నా: బిహార్ అసెంబ్లీని రద్దు చేసే యోచనలో సీఎం నితీష్ కుమార్ ఉన్నారని సమాచారం. లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష‍్ట్రంలో నితీష్ కుమార్ తీరుపై లాలూ కుమార్తె రోహిణి ఫైర్ అయ్యారు. నితీష్ కుమార్ పచ్చి అవకాశవాది అంటూ ట్వీట్ చేశారు. దీంతో మాహా కూటమిలో ఉన్న జేడీయూ, ఆర‍్జేడీ మధ్య విభేదాలు బయటకొచ్చాయి.
బిహార్ రాజకీయ క్షేత్రంలో కీలక మలుపులు చోటుచేసుకోబోతున్నాయి. బిహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి బీజేపీతో కలిసిపోనున్నారని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మహాకూటమి(మహాగత్‌బంధన్) నుంచి వైదొలగనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇండియా కూటమికి అతిపెద్ద షాక్ తగలనుంది.
నితీష్ కుమార్ 2013 నుంచి ఎన్డీయే, మహాఘట్‌బంధన్ మధ్య ఊగిసలాడుతున్నారు. నిత్యం పొత్తులతో జిమ్మిక్కులు చేస్తూ సీఎం పదవిని చేజిక్కించుకుంటూ వచ్చారు. మహాకూటమి నుంచి వైదొలిగి ఎన్డీయేలో చేరిన రెండేళ్లకే చివరిసారిగా 2022లో ఆయన మళ్లీ మహాకూటమిని ఏర్పరిచారు. 2020లో బిహార్‌లో చివరిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సహా స్థానిక పార్టీలతో కలిసి మహాకూటమి పేరుతో ప్రభుత్వం ఏర్పడింది. నితీష్ కుమార్ సీఎం అయ్యారు.
అనుమానాలకు ఆజ్యం..
దివంగత సీఎం కర్పూరీ రాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారత రత్న ప్రకటించడాన్ని నితీష్ ప్రభుత్వం స్వాగతించింది. అంతేకాకుండా వంశపారంపర్య రాజకీయాలను ఎత్తిచూపుతూ ఆర్జేడీ టార్గెట్‌గా నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్పూరీ ఠాకూర్ చూపిన మార్గంలోనే తమ పార్టీ పయనిస్తోందని నితీష్ పేర్కొన్నారు. కొన్ని పార్టీలు తమ వారసులకు రాజకీయ భవిష్యత్ కోసం పోరాడుతారని విమర్శించారు.
నితీష్ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత లాలూ కుమార్ కుమార్తె రోహిణీ ఘాటుగా స్పందించారు. కొందరు తమ సొంత లోపాలను చూసుకోలేరు.. ఇతరులపై బురద జల్లుతారు అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఈ పరిణామాలు బీజేపీ వైపు నితీష్ కుమార్ అడుగులు పడుతున్నాయనడానికి అనుమానాలను పెంచుతున్నాయి.
జోడో యాత్రలో జాయిన్ కాము..
అటు.. జనవరి 30న బిహార్‌లో ప్రవేశించే కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో నితీష్ కుమార్ హాజరుకాబోరని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు షకీల్ అహ్మద్ ఖాన్ ద్వారా నిన్న సాయంత్రం ఆహ్వానం అందిందని.. అయితే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల చర్చల్లో జాప్యం జరగడంతో నితీష్ కుమార్ కలత చెందారని వెల్లడించాయి.
ఇదీ చదవండి: నితీష్ కుమార్‌పై లాలూ కూతురు ఫైర్
Comments
Please login to add a commentAdd a comment