‘ఇక మీతోనే ఉంటా..’ ప్రధాని మోదీ నవ్వులు | Nitish Kumar Says wont Stray Promise To PM on Stage Bihar | Sakshi
Sakshi News home page

‘ఎక్కడికి వెళ్లను ఇక మీతోనే ఉంటా..’ సీఎం నితీశ్‌ మాటలతో ప్రధాని మోదీ నవ్వులు

Published Sat, Mar 2 2024 5:38 PM | Last Updated on Sat, Mar 2 2024 6:00 PM

Nitish Kumar Says wont Stray Promise To PM on Stage Bihar - Sakshi

ఎప్పుడూ మీతోనే ఉంటానని నితీశ్‌ అనడంతో ప్రధాని మోదీ పగలబడి నవ్వారు.. 

పట్నా: తాను ఇక పార్టీలు మారబోనని బీజేపీ-ఎన్డీయే కూటమిలో ఉంటానని బిహార్‌ సీఎం నితీష్‌కుమార్.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాటిచ్చారు. నితీష్‌ మాటలతో వేదికపై ఉన్న ప్రధాని మోదీ సహా పలువురు నేతలు పగలబడి నవ్వారు. బిహార్‌లోని ఔరంగాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. 


‘మీరు(మోదీ) త్వరగా వచ్చారు. లేకపోతే నేను పూర్తిగా మాయమయ్యేవాడిని. కానీ, నేను మీతో( మోదీ) ఉన్నా. నేను మీకు హామీ ఇస్తున్నా నేను ఏ కూటమిలోకి మారబోను. నేను మీతోనే ఉంటాను’ అని సీఎం నితీష్‌ కుమార్‌ అన్నారు.

నితీష్‌ కుమార్‌.. బిహార్‌లోని మహాకూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీ ఎన్డీయే కూటమిలో చేరిన విషయం తెలిసిందే. జనవరిలోని నితీష్‌ కుమార్‌ బీజేపీ కూటమి మద్దతుతో తొమ్మిదోసారి సీఎం ప్రమాణం చేశారు.  నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయేలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ బీహార్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇక.. రూ. 4,800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ బిహార్‌లో పర్యటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement