లోక్‌సభ ఎన్నికలకు బీహార్‌లోని జనతాదళ్‌యునైటెడ్ (జేడీయూ) అభ్యర్థుల పేర్లు ఇవేనంటూ కొన్ని లీకులు బయటకు వస్తున్నాయి. వీటి ప్రకారం చూస్తే ఈ ఎన్నికల్లో జేడీయూ పాతవారికి చెక్ పెట్టి, కొత్తవారికి అవకాశం కల్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పార్టీ టిక్కెట్లు దక్కనివారిలో కొంతమంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారని సమాచారం. సీట్ల పంపకంలో జేడీయూ తమ సిట్టింగ్ ఎంపీల టిక్కెట్లకు కోతపెట్టి, వాటిని మిత్ర పక్షాలకు కట్టబెట్టినట్లు సమాచారం. మీడియాకు అందిన వివరాల ప్రకారం సీట్ల పంపకంలో కరకట్ ఎంపీ మహాబలి సింగ్, గయ ఎంపీ విజయ్ మాంఝీ, సివాన్ ఎంపీ కవితా సింగ్, సీతామర్హి ఎంపీ సునీల్ కుమార్ పింటూలకు టిక్కెట్లు దక్కలేదని తెలుస్తోంది. అయితే శివహార్ నుంచి లవ్లీ ఆనంద్, సీతామర్హి నుంచి దేవేశ్ చంద్ర ఠాకూర్, శివన్ నుంచి రాజలక్ష్మి కుష్వాహా, కిషన్‌గంజ్ నుంచి మాస్టర్ ముజాహిద్ పేర్లను జేడీయూ ఖరారు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ పేర్లను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బీహార్‌లో జేడీయూకు 16 సీట్లు దక్కాయి. వాల్మీకినగర్ నుండి సునీల్ కుమార్, భాగల్పూర్ నుండి అజయ్ మండల్, మాధేపురా నుండి దినేష్ చంద్ర యాదవ్, ఝంఝార్పూర్ నుండి రాంప్రీత్ మండల్, సుపాల్ నుండి దిలేశ్వర్ కామత్, జెహానాబాద్ నుండి చండేశ్వర్ చంద్రవంశీ తదితరులు జేడీయూ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment