పట్నా: తాను హిందువునని, కానీ బీజేపీ వాళ్లవలే రాజకీయ ప్రయోజనాల కోసం బహిరంగా ప్రదర్శించనని జనతా దల్(యునైటెడ్) సీనియర్ నేత రాంజన్ సింగ్ అలియాస్(లలన్ సింగ్) మండిపడ్డారు.ఆయన జేడీయూ పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత మొదటిసారి ముంగేర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ సభలో లలన్ సింగ్ మాట్లాడారు.
మతం, దేవుడిపై విశ్వాసం అనేని రాజకీయ ప్రయోజనాల కోసం బహిరంగంగా ప్రదరర్శిల్సిన అవసరం లేదన్నారు. తాను కూడా పవిత్రమైన హిందువునని, దేవుడిపై అధికమైన విశ్వాసం కలవాడినిని తెలిపారు. కానీ, బీజేపీ నేతలవలే తాను మతాన్ని బయటకు ప్రదర్శించని మండిపడ్డారు. ఆధ్యాత్మీక ప్రదేశాలు.. ప్రదర్శన వస్తువులు కాదని దుయ్యబట్టారు.బీజేపీ వాళ్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. దీనికి తోడు మీడియా సైతం స్పాన్సర్ చేయబడిన వార్తలవలే ప్రజల్లోకి వ్యాప్తి చేస్తోందని అన్నారు.
బిహార్ ప్రభుత్వం, జేడీయూ మధ్య చీలికలు వచ్చాయన్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అటువంటి వదంతులు అన్ని సత్యదూరమని స్పష్టం చేశారు. బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వం చాలా స్ధిరంగా ఉందన్నారు. రాబోయో సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి పోరుకు దిగుతామని అన్నారు. బిహార్‌లో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీకి వీడ్కోలు పలుకుతామని అన్నారు. ప్రజలు కూడా బీజేపీ వీడ్కోలు పలకడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
అయితే లలన్ సింగ్‌ను జేడీయూ అధ్యక్ష పదవి నుంచి కావాలనే తొలగించిందని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. జేడీయూ పార్టీకి నితీష్ కుమార్.. మొదటిగా ఆర్‌సీపీ సింగ్‌ను అధ్యక్షుడిగా చేసి, తర్వాత లలన్‌సింగ్ చీఫ్‌గా చేసి.. ఇప్పుడు మాత్రం తనే పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చున్నారని బిహార్ బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ ఎద్దేవా చేశారు.
అయితే తాను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో సన్నిహితంగా ఉండటం వల్లనే సీఎం నితీష్ కుమార్ తనను జేడీయూ అధ్యక్ష పదవి నుంచి తప్పించాడని వార్తలు రాసిన మీడియాపై దావా వేస్తానని అన్నారు. కొన్ని పత్రికలు, టీవీ చానెల్స్ తనపై అసత్య వార్తలు ప్రచురించి పరువుకు నష్టం కలిగించాయని లలన్ సింగ్ మండిపడ్డారు.
చదవండి: ‘పీహెచ్‌డీ సబ్జీవాలా’: ఉద్యోగం కంటే.. కూరగాయల అమ్మకంతోనే..
Comments
Please login to add a commentAdd a comment