Nitish Kumar.. బీహార్ పాలిటిక్స్‌లో సంచలనం చోటుచేసుకుంది. నితీశ్ కుమార్ బీహార్ సీఎం పదవికి మంగళవారం రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఫగూ చౌహాన్ కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. అయితే, ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. కొత్త ప్రభుత్వంలో కూడా సీఎంగా నితీష్ కుమారే ఉండనున్నట్టు సమాచారం. ఆర్జేడీ మద్దతు ఇస్తున్న కారణంగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. బీహార్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బీజేపీతో సంబంధాలు సరిగా లేని కారణంగా.. ఆ కూటమికి ఇవాళ గుడ్‌బై చెప్పేశారు నితీశ్. బీజేపీ(77)-జేడీయూ(45) కూటమి పాలన బీహార్‌లో ముగిసిపోయింది.
#WATCH | Nitish Kumar confirms that he has resigned as Bihar CM pic.twitter.com/Av04rUXojx
— ANI (@ANI) August 9, 2022
రాజీనామా అనంతరం నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పదవికి రాజీనామా చేశాను. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చాము. జేడీయూను విడదీసేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. తమకు 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో తెలిపారు.
ఇక.. నితీష్ కుమార్ రాజీనామా చేసిన అనంతరం.. పాట్నాలోని రాబ్రీ దేవి ఇంటికి బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
Bihar | After tendering his resignation, Nitish Kumar arrives at the residence of Rabri Devi in Patna pic.twitter.com/lwAGHSrupv
— ANI (@ANI) August 9, 2022
ఇది కూడా చదవండి: లాలు యాదవ్ కుమార్తె ట్వీట్... బలపడనున్న 'గత బంధం'
Comments
Please login to add a commentAdd a comment