ఇంఫాల్ : బీహార్ సీఎం నితిష్ కుమార్ (cm nitish kumar) బీజేపీకి ఝలక్ ఇచ్చారు. మణిపూర్ (manipur) బీజేపీ (bjp) నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో జనతా దళ్ (యునైటెడ్) తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు జేడీయూ యూనిట్ అధినేత కాష్ బీరెన్ సింగ్ రాష్ట్ర అధికార బీజేపీకి మద్దతు ఉప సంహరించుకుంటున్నట్లు మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ బహ్లాకు లేఖ రాశారు. ప్రతిపక్ష బాధ్యత వహిస్తారని సూచించారు.
మణిపూర్‌లో తమపార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్ నసీర్‌కు అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో సీటును కేటాయించాలని కోరారు. ఇకపై రాష్ట్రంలో బీజేపీకి జేడీయూ మద్దతు ఉండబోదని, అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతారని లేఖలో పేర్కొన్నారు. గతంలో బీజేపీకి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. తాజాగా, జేడీయూ సైతం కమలానికి గుడ్ బై చెప్పడం మణిపూర్ రాష్ట్ర రాజకీయాలు చర్చాంశనీయంగా మారాయి.
2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆరు స్థానాలను గెలుచుకుంది. అయితే ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల తర్వాత ఐదురుగు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 60 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు.
బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటే బీహార్‌లో అభివృద్ది ఆగిపోతుందనే అనుమానాల్ని జేడీయూ నేతలు కొట్టి పారేస్తున్నారు. కేంద్ర ఎన్‌డీఏ కూటమిలో జేడీయూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాదు కూడదు అంటే .. అది బీజేపీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment