సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాలను ఏకం చేయాలనే లక్ష‍్యంతో సోమవారం నుంచి ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు బిహార్ సీఏం నితీశ్ కమార్. ఇందులో భాగంగనే బుధవారం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు మాత్రమే తాను ప్రయత్నిస్తున్నాని, ప్రధాని అభ్యర్థి కావాలనే ఆలోచన లేదని నితీశ్ స్పష్టం చేశారు. అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే 2024 ఎన్నికల్లో పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పారు. అందుకే అన్ని పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
మెయిన్ ఫ్రంట్..
తాము థర్డ్ ఫ్రంట్ కోసం కాదు మెయిన్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు నితీశ్ వ్యాఖ్యానించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలతో తాను జరిపిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఏకపక్షంగా జరుగుతున్న ఎన్నికలు 2024లో భిన్నంగా ఉంటాయన్నారు. ప్రధాని మోదీకి పోటీగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరుంటారని మీడియా ప్రశ్నించగా.. నితీశ్ స్పందించారు. ప్రకటనలు, పేర్లు మార్చడం తప్ప బీజేపీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు.
నితీశ్ సన్నిహిత వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి విపక్షాలను ఏకం చేయడంపైనే ఆయన దృష్టిసారించినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో విపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే బీజేపీకి కలిసొచ్చిందని ఆయన భావిస్తున్నారు. విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటారనే విషయంపై ఇప్పటివరకైతే పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదర్లేదు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ పేర్లను పరిశీలించే అవకాశాలు కన్పిస్తున్నాయి. నితీశ్ కుమార్ పేరును కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు.
చదవండి: భారత్ జోడో యాత్ర షురూ
Comments
Please login to add a commentAdd a comment