![RJD Tej Pratap Yadav Admitted To Hospital - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/15/rjd-jej-pratap-yadav.jpg.webp?itok=jiDHwlBX)
రాష్ట్రీయ జనతా దళ్ ( RJD ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు 'తేజ్ ప్రతాప్ యాదవ్' శుక్రవారం స్వల్ప అస్వస్థకు గురయ్యారు. లో బీపీ (బ్లడ్ ప్రెషర్) కారణంగా ఛాతిలో నొప్పి రావడంతో పాట్నాలోని రాజేంద్ర నగర్‌లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు.
ఇంటి వద్ద ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఛాతిలో నొప్పి అని చెప్పడంతో.. అతని సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. తేజ్ ప్రతాప్ ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరడం తొమ్మిది నెలల్లో ఇది రెండోసారి.
ఆసుపత్రిలో చేరటానికి ముందు తేజ్ ప్రతాప్ యాదవ్ కృష్ణబ్రహ్మం ప్రాంతంలో జ్ఞాన్ బిందు గ్రంథాలయాన్ని ప్రారంభించి బక్సర్ జిల్లాను సందర్శించారు. ఇప్పటికే పర్యావరణ శాఖ, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఈయన పనిచేశారు. ప్రస్తుతం ఈయన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment