‘కట్నం లేకుంటేనే ఆ పెళ్లికి హాజరవుతా’ | Tej Pratap Marriage: JDU MLC Says Will Attend Only If Its Without Dowry | Sakshi
Sakshi News home page

‘కట్నం లేకుంటేనే ఆ పెళ్లికి హాజరవుతా’

Published Sun, Apr 29 2018 5:56 PM | Last Updated on Sun, Apr 29 2018 5:58 PM

Tej Pratap Marriage: JDU MLC Says Will Attend Only If Its Without Dowry - Sakshi

సాక్షి, పాట్నా : బిహార్‌ మాజీ సీఎం దుర్గా ప్రసాద్‌ రాయ్‌ మనవరాలు ఐశ్వర్యా రాయ్‌తో తన వివాహానికి ఆహ్వాన పత్రికలను పంచేందుకు ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ సిద్ధమయ్యారు. బిహార్‌ రాజకీయాల్లో దిగ్గజాలందరికీ స్వయంగా తేజ్‌ ప్రతాప్‌ పెళ్లిపత్రికలను అందచేస్తున్నారు. అయితే తేజ్‌ ప్రతాప్‌ కట్నం తీసుకోకుండా ఉంటేనే తాను ఈ పెళ్లికి హాజరవుతానని జేడీ(యూ) ఎంఎల్‌సీ నీరజ్‌ కుమార్‌ షరతు విధించారు. ఎలాంటి కట్న ప్రసక్తి లేకుండానే ఐశ్వర్యా రాయ్‌తో తన వివాహం జరుగుతోందని తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ప్రకటించాలని ఆయన కోరారు. అప్పుడే తాను ఈ వివాహానికి హాజరవుతానని మెలిక పెట్టారు.

ఎలాంటి ఆర్భాటం లేకుండా తన పెళ్లి వేడుక జరుగుతుందని కూడా తేజ్‌ ప్రతాప్‌ ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. జేడీ(యూ) ఎంఎల్‌సీ షరతులపై ఆర్‌జేడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ను ఆర్జేడీ టార్గెట్‌ చేస్తూ ముందుగా నితీష్‌ పార్టీ కట్నానికి, మద్యానికి దూరంగా ఉందా అన్నది స్పష్టం చేయాలని కోరింది. తేజ్‌ ప్రతాప్‌, ఐశ్వర్యారాయ్‌ల వివాహ నిశ్చితార్థం ఈనెల 18న పాట్నాలోని హోటల్‌ మౌర్యలో జరిగిన విషయం తెలిసిందే. మేలో వీరింద్దరి వివాహం అత్యంత ఆర్భాటంగా జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement