
పట్నా : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఎదురుగా వస్తున్న కారు ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ సంఘటనలో తేజ్ ప్రతాప్ కాలుకు గాయమవ్వగా.. అతని సహాయకులు తీవ్రంగా గాయపడ్డారు. తేజ్ ప్రతాప్ తన ఇంటి నుంచి పార్టీ కార్యాలయం వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని పారస్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment