
సాక్షి, పాట్నా : బిహార్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇంట్లోకి మందుబాబులు చొరబడి హల్ చల్ చేశారు. చంపేస్తానంటూ వార్నింగ్ కూడా ఇవ్వడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం గౌరవ్ యాదవ్ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి, తన స్నేహితులతో కలిసి పాట్నాలోని తేజ్ ప్రతాప్ యాదవ్ ఇంట్లోకి దూసుకెళ్లారు.
ఆ సమయంలో తేజ ప్రతాప్ యాదవ్ ఇంట్లో లేకపోవడంతో అక్కడ ఉన్న ఆయన సన్నిహితుడు, ఆర్జేడీ యూత్ వైస్ ప్రెసిడెంట్ సృజన్ స్వరాజ్‌ను వారు బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే స్వరాజ్ ను చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో వారిని అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు. ఈ విషయంపై సృజన్ పోలీసులను ఆశ్రయించారు. గౌరవ్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీసు అధికారులకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment