ఆటోను ఢీకొన్న యువనేత బీఎండబ్ల్యూ.. | Tej Prataps BMW Hits Auto Rickshaw In Varanasi | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న యువనేత బీఎండబ్ల్యూ..

Published Thu, Nov 14 2019 3:24 PM | Last Updated on Thu, Nov 14 2019 3:25 PM

Tej Prataps BMW Hits Auto Rickshaw In Varanasi - Sakshi

లక్నో : ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ తనయుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ పేరిట నమోదైన బీఎండబ్ల్యూ కారు యూపీలోని వారణాసిలో ఓ ఆటోను ఢీ కొట్టింది. వారణాసిలోని రోహిన్య ప్రాంతంలో గురువారం ఉదయం బీఎండబ్ల్యూ కారు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు బంపర్‌ దెబ్బతిందని స్ధానికులు తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ కారులో లేరు. తేజ్‌ ప్రతాప్‌ను రిసీవ్‌ చేసుకునేందుకు తాము ఢిల్లీ వెళుతున్నామని కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలైన సమాచారం ఇప్పటివరకూ రాలేదని అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement