బ్రేకప్‌ : ఐశ్వర్యా రాయ్‌కు తేజ్‌ ప్రతాప్‌ విడాకులు..? | RJD Leader Tej Pratap Yadav Files For Divorce From Aishwarya Rai | Sakshi
Sakshi News home page

ఆర్భాటంగా వివాహం : అప్పుడే విడాకులు..?

Nov 2 2018 7:50 PM | Updated on Nov 2 2018 7:54 PM

RJD Leader Tej Pratap Yadav Files For Divorce From Aishwarya Rai - Sakshi

ఐశ్వర్యా రాయ్‌కు తేజ్‌ ప్రతాప్‌ విడాకులు

పట్నా : ఈ ఏడాది మే 12న బిహార్‌ మాజీ సీఎం దుర్గా ప్రసాద్‌ రాయ్‌ మనవరాలు ఐశ్వర్యా రాయ్‌ను వివాహం చేసుకున్న ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ కుమారుడు, బిహార్‌ మాజీ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఆమెతో తెగతెంపులకు సిద్ధమయ్యారు. పట్నా కోర్టులో విడాకులు కోరుతూ తేజ్‌ ప్రతాప్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్టు తెలిసింది. అయితే భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారనే వార్తలను ఆయన ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

బిహార్‌లోని చాప్రా నుంచి ఆర్జేడి టికెట్‌పై ఐశ్వర్యా రాయ్‌ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తల నేపథ్యంలో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తన భార్య రాజకీయాల్లో అడుగుపెట్టరని తేజ్‌ ప్రతాప్‌ స్పష్టం చేసినా పార్టీ వ్యవస్ధాపక దినోత్సవం రోజున ఆమె ఫోటోలతో కూడిన పోస్టర్లు వెలిశాయి. ఆర్జేడీ కార్యకర్త వాసీం అక్రం ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ ఏడాది మే 12న తేజ్‌ ప్రతాప్‌, ఐశ్వర్యా రాయ్‌ల వివాహం అత్యంత ఆర్భాటంగా జరిగిన సంగతి తెలిసిందే. పశుగ్రాస కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్‌ తన కుమారుడి వివాహానికి పెరోల్‌పై హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement