న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ, అతని కుటుంబ సభ్యుల మీద ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నగదు అక్రమ చలామణి కేసును నమోదు చేసింది. యూపీఏ హయాంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ రైల్వే హోటళ్ల కేటాయింపుల్లో అవకతవకల కు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది.
లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. కేసులో వారిని నిందితులుగా చేర్చింది. జూలై 5న లాలూ, అతని కుటుంబ సభ్యులపై సీబీఐ క్రిమినల్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి వారి ఇళ్లలపై పలు సోదాలు చేసింది. యూపీఏ హయాంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్ రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్ల మెయింటెనెన్స్‌ను లంచం తీసుకుని ఒక కంపెనీకి అప్పగించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ నమోదుచేసింది.