మా మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు | Modi attempting Lalu-Nitish divide, says Lalu | Sakshi
Sakshi News home page

మా మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు

Published Sat, Jul 25 2015 3:04 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

మా మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు - Sakshi

మా మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు

పట్నా: తమను విడదీసేందుకు ప్రయత్నిస్తున్న నరేంద్రమోదీ ఎత్తులు సాగవని ఆర్జేడీ నేత, మాజీ సీఎం లాలు ప్రసాద్ స్పష్టంచేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్పై ప్రశంసలు కురిపించి,  తనపై దాడి చేసి తమ మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. బీహార్ అభివృద్ధి చెందకపోవడంపై తనను, కాంగ్రెస్ పార్టీని విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. తమలో ఒకడైన నితీష్ను పొగిడి, తమ కూటమి మధ్య విభేదాలు సృష్టించడానికి చూస్తున్న మోదీ దుష్టపన్నాగం తమకు తెలుసన్నారు. ఈ విషయంలో ఆయన ఎప్పటికీ  విజయం సాధించలేరన్నారు లాలు.

ఎన్నికల ప్రచారం కోసం బీహార్లో ఒకరోజు  పర్యటనకు వెళ్లిన ప్రధాని,   పట్నాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ  సందర్భంగా సీఎం నితీష్, పీఎం మోదీ ఒకే వేదికపై ఆసీనులయ్యారు. బహిరంగ సభలో మోదీ.. నితీష్పై ఒకింత సానుభూతిని, ఓ మోస్తరు ప్రశంసలను గుప్పించారు. ఈ నేపథ్యంలోనే లాలు ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఆర్జేడీ, ఎల్జేడీ, కాంగ్రెస్ తదితర పార్టీలన్నీ ఏకమై కూటమిగా ఏర్పడ్డాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో ఈ కూటమి ముందుకు సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement