ఈ అనుమానాలు అర్థరహితం | Lord Ram statue to be built by Yogi Adityanath | Sakshi
Sakshi News home page

ఈ అనుమానాలు అర్థరహితం

Published Tue, Oct 24 2017 1:01 AM | Last Updated on Tue, Oct 24 2017 2:24 AM

Lord Ram statue to be built by Yogi Adityanath

విశ్లేషణ
యోగి సరయూ నదికి హారతి పట్టడం బాగానే ఉంది. పెద్ద రామ విగ్రహ నిర్మాణమూ బాగానే ఉంది. అలాంటి విగ్రహాన్ని నెలకొల్పడం అయోధ్యకు తగ్గట్టుగానే ఉంటుంది. దానికి వివాదాస్పద స్థలానికి మధ్య సంబంధమే లేదు.

రామ మందిరం– బాబ్రీ మసీదు కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా అయోధ్య ప్రధాన చర్చనీయాంశం అవు తోంది. ఎప్పుడూ అది వార్త ల్లోనే ఉంటోంది. రాజకీయాలు దాని చుట్టూనే తిరుగుతు న్నాయి. నాకు తెలిసిన వారిలో ఎవరైనా ఎప్పుడైనా అయో ధ్యను సందర్శించడం, లేక దాన్ని చూసి రావాలనే ఆకాంక్షను వ్యక్తం చేయడం జరిగిందేమో గుర్తుచేసుకుం దామని బాగా తరచి ఆలోచిస్తున్నాను. సాధారణంగా చార్‌ ధామ్‌ (నాలుగు పుణ్య క్షేత్రాలు)– బద్రీనాథ్, ద్వారక, పూరి, రామేశ్వరం లేదా కాశీ, పన్నెండు జ్యోతి ర్లింగాలు మాత్రమే భక్తులు ‘తప్పనిసరిగా దర్శించా ల్సిన’ వాటిలో భాగంగా ఉంటాయి. సప్తపురిగా పిలిచే ఏడు నగరాలలో అయోధ్య కూడా ఒకటి. పైన పేర్కొ న్నవాటిలో కొన్ని కూడా ఆ ఏడింటిలో ఉన్నా, అయోధ్య మాత్రం ఎన్నడూ అగ్రశ్రేణి దర్శనీయ స్థలం కాదు.

గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కడానికి తగినన్ని దీపాలను వెలిగించి గతవారం అయోధ్యలో జరిపిన దీపావళి ఉత్స వంపై చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఆ వేడుకను పైన చెప్పిన నేపథ్యం నుంచి చూడాలి. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తన సొంత బ్రాండు హిందుత్వను ప్రదర్శించి చూపడానికి అసాధారణమైనది ఏదో చేయాలని చేసిన ఉత్సవం కాదది. వంద అడుగుల రాముని విగ్రహాన్ని నిర్మించడానికి ప్రణాళికను యోగి రూపొందించారు నిజమే. కానీ ఆయన అయోధ్యలోని కూలదోసిన, వివాదాస్పద కట్టడాన్ని పునర్నిర్మించే పనేమీ చేయలేదు. యోగి చేసే పలు వాదనలతో నాకు విభేదాలున్నాయి. ఆయన ప్రాపంచికమైన వాటిని అన్ని టినీ విసర్జించిన సాధువు కారనేది వాటిలో ప్రాథమి కమైనది. గోవధ నిషేధం వల్ల కలిగే ఆర్థిక ప్రభావాన్ని విస్మరించడం, గోసంరక్షణవాదం వంటివి కూడా నేను విభేదిస్తాను. అయితే, అయోధ్యను తిరిగి పర్యాటక ప్రదే శాలలో ఒకదానిగా, ప్రత్యేకించి దేశంలోని అంతర్గత పర్యాటకులకు దర్శనీయ స్థలంగా మార్చడం కోసం యోగి చేసిన ప్రయత్నాన్ని నేను తిరస్కరించలేను.

ఏదిఏమైనా అయోధ్యలో నెలకొల్పనున్న ఆ రామ విగ్రహానికి తగ్గట్టుగా సరిపడేటన్ని హోటల్‌ గదులు, రవాణా సదుపాయాల వంటివి కూడా ఏర్పడతాయని ఆశించాలి. దాని నిర్వహణ సజావుగా సాగుతుందని, ఖర్చు చేసిన డబ్బుకు తగ్గ విలువ లభించేట్టు చూడటం పట్ల పట్టింపు లేకుండా పర్యాటకుల జేబుల్లోని డబ్బును దండిగా పిండేసుకునే ప్రాంతంగా అది మిగిలిపోదని కూడా అనుకుందాం. గంగా నదికి రాత్రిపూట బ్రహ్మాం డంగా హారతులను పట్టడాన్ని మీరు శివరాత్రి నాడు లేదా మోదీ ఎవరైనా ప్రపంచ నేతలను అక్కడికి తీసు కెళ్లినప్పుడు టీవీల్లో చూసే ఉంటారు. గంగానదిలాగే ఒక పవిత్ర స్థలంతో ముడిపడి ఉన్న సరయూ నది కూడా అంత పవిత్రమైనది ఎందుకు కాకూడదు? రామునితో ముడిపడి ఉండటం కారణంగా అయోధ్య పవిత్రమైనది అయినప్పుడు, సరయూ కూడా పవిత్రమైనదే.

1980 శీతాకాలంలో నెల రోజుల పాటూ వార ణాసిలో గడిపాను. అప్పుడు తరచుగా గంగానది ఘాట్ల వద్దకు వెళుతుండేవాడిని. ఇప్పటిలాంటి హారతులు అçప్పట్లో లేవు. కనీసం ఇప్పుడు మనం చూస్తున్న స్థాయి లోవి లేవు. ఇప్పుడు చూస్తున్నట్టుగా గంగా హారతులు జరగడం పాత సాంప్రదాయమేనంటే ఎలాంటి అభ్యంత రాలూ లేకుండా ఆమోదించారు. సరయూ హారతిని కూడా అలా ఆమోదించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పర్యాటక ప్రదేశాలకు ప్రాచుర్యం కల్పించడం కోసం కొత్త ఆకర్షణలు ప్రవేశపెట్టడం సమంజసమే.

కాబట్టి, సరయూ నదికి హారతి పట్టడం బాగానే ఉంది. పెద్ద రామ విగ్రహ నిర్మాణమూ బాగానే ఉంది. అలాంటి విగ్రహాన్ని నెలకొల్పడం అయోధ్యకు తగ్గట్టు గానే ఉంటుంది. దానికి వివాదాస్పద స్థలానికి మధ్య సంబంధమే లేదు. దాన్నేదో కుట్రగా చూడటం అర్థరíß తం. ముంబైకి గేట్‌వే ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌కు చార్మినార్‌లా సంకేతాత్మక కట్టడమేదీ లేని ఆ నగరంలో రాముని విగ్రహం పర్యాటక రంగానికి సంబంధించి ప్రధాన ఆకర్షణ అవుతుంది. కాబట్టి సరయూ నది ఒడ్డున భారీ విగ్రహం అనే ఆలోచన మంచిదే.

కనీసం అది, తాజ్‌మహల్‌ కంటే ముందు అక్కడ శివాలయం ఉండేదనే మూర్ఖపు ఆలోచనకంటే తక్కువ చెడ్డది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజ్ఞానులైన మంత్రులు లేవనెత్తిన ఆ వాదన, ఒకప్పుడు హిందూవాద చరిత్రకా రుడు పీఎన్‌ ఓక్‌ చేసిన వాదనను నెమరు వేయడమే. యోగి యోచన, అయోధ్యలో ఒకప్పుడు ఉండిన వివాదా స్పద కట్టడాన్ని కూలగొట్టిన చోటనే రామ మందిరాన్ని పునర్నిర్మించాలని కోరడం అంత చెడ్డదీ కాదు.

కాబట్టి అయోధ్యను మంచి పర్యాటక స్థలంగా చేయాలనే ప్రయత్నం గురించి మనం ఇంత రాద్ధాంతం చేయాల్సిన పని లేదు. దేశీయంగా అంతర్గతంగా జరిపే పర్యటనల్లో అత్యధిక భాగం బంధువులను చూడటా నికి, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం జరిపేవే. యోగి ప్రయత్నాన్ని ప్రతికూల దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. అది నిరపాయకరమైనది. అలా అని, ఆసుప త్రుల్లో పసిపిల్లల మరణాలవంటి ప్రధాన పాలనాప రమైన సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోనవసరం లేదని నేను యోగికి చెబుతున్నానని అర్థం కాదు.

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
మహేష్‌ విజాపృకర్‌
ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement