గోల గోల పండుగల వేళ
విశ్లేషణ
ధ్వని కాలుష్య నిరోధం గురించిన ప్రభుత్వ చట్టాలున్నా పండుగ సంబరాల నిర్వాహకులకు ఆ పట్టింపే ఉండదు. శబ్ద కాలుష్యం తాత్కాలికమైనదే అయినా, శాశ్వతమైన నష్టాన్ని కలగజేయగలదని రుజువైంది.
మన భారతీయులకు లెక్కలేనన్ని పండుగలు న్నాయి. అవి ఎక్కువగా మతంతో ముడిపడినవి. ఈ వేడుకల విలువకు కొలబద్ద శబ్దమేనని మన వాళ్లు అపార్థం చేసుకుం టున్నారని అనిపిస్తుంది. రాత్రంతా చెవులు చిల్లులు పడేలా చేసే సంగీత ఘోషతో కూడిన దేవీ నవరాత్రే కావచ్చు, లేదా రోడ్డుకు అడ్డంగా పైనుంచి వేలాడు తున్న ఉట్టిని అందుకోడానికి దొంతరలు, దొంతర లుగా ఒకరిపైకి ఒకరు పైకి ఎక్కే దహీహండి(ఉట్లు కొట్టడం)యే కావచ్చు.
శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాతి రోజున... కృష్ణ పర మాత్మునికి అందకుండా తల్లి ఎత్తుగా ఉన్న ఉట్టిలో ఉంచిన వెన్నను దొంగిలించడానికి ఆయన చేసిన లీలను అనుకరిస్తూ దహీహండి వేడుక జరుగు తుంది. మహారాష్ట్రలో అది పెద్దగా చప్పుళ్లు లేకుం డానే సాగిపోతుంది. హైడెసిబల్ సౌండ్ సిస్టమ్స్‌ను సరఫరా చేస్తే పోలీసులు స్వాధీనం చేసుకుంటారని వాటిని అద్దెకు ఇవ్వకపోవడమే అందుకు కారణం. లేకపోతే అది కూడా మహా శబ్ద ఘోషగా సాగేదే.
ఆ తర్వాత చలికాలం వచ్చేసరికి దేవీ నవరాత్రి వంతు వస్తుంది. ఆ తొమ్మిది రాత్రులు స్త్రీ పురుషులు రాత్రిళ్లు గుజరాతీ దాండియా (కోలాటం) బాణీలు మోగుతుండగా నృత్యాలు చేస్తారు. అవి దసరా పండుగతో ముడిపడినవి. కాబట్టి నవరాత్రులకు కూడా ప్రాతిపదిక మతమే. కానీ, ఈ దాండియా వేడుకలను, ప్రధానంగా వాణిజ్యపరమైన కార్యక్ర మాలుగా ఈవెంట్ మేనేజర్లు టికెట్లు అమ్మి నిర్వహి స్తారు. వాటిలో కూడా డీజేలు హై డెసిబల్ సౌండ్ సిస్టమ్స్‌ను ఉపయోగిస్తూ, చెవులు గింగురుమనేలా సంగీతాన్ని వినిపిస్తారు.
ఇక ఇప్పుడు, శుక్రవారం నుంచి ప్రారంభ మయ్యే గణేశ్ చతుర్థి వంతు. దాదాపు ప్రతి వీధి మలుపునా గజాననుని విగ్రహానికి పూజలు చేస్తారు. రోడ్లను, రోడ్డు పక్క ఉండే పాదచారుల బాటలను ఆక్రమించి, వాహనాలు సహా రాకపోకలన్నింటినీ అడ్డగించేస్తారు. లౌడ్ స్పీకర్లు ఈ పండుగ సర్వసా ధారణ లక్షణం. ఈ శబ్ద కాలుష్యానికి వ్యతిరేకంగా చేసిన ప్రచార ఉద్యమం ఏమైనా విజయం సాధిం చిందో లేదో వేచి చూడాలి. కోర్టులైతే అలాంటి ధ్వనులను నిషేధించాయి.
దహీహండి పగటిపూట సాగే ఒక రోజు కార్య క్రమం. నవరాత్రి, గణేశ్ చతుర్థి తొమ్మిది రోజులు, పది రోజులు సాగే వేడుకలు. నిర్వాహకులు ఈ వేడు కలకు లౌడ్ స్పీకర్ల ఉపయోగపు వేళల పరిమితు లను 10 గంటల పరిమితికి దాటి కొనసాగేలా, కనీసం చివరి మూడు రోజులకైనా మిహాయింపు లను కోరి, సాధిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనేవారు ఇది మతపరమైన ఉత్సాహం అంటారు, ఇతరు లేమో ఆ విపరీత శబ్దాల వల్ల బాధపడాలి. 70 డెసి బల్స్‌కు మించిన శబ్దాలు ఈ పండుగలకు గుర్తుగా మారాయి.
గణేశ్ చతుర్థి సందర్భంగా, రెండో రోజు నుంచే నిమజ్జనాలు సాగుతుంటాయి. కాబట్టి రోజంతా ఆ గోల సాగుతూనే ఉంటుంది. పదో రోజున పెద్ద పెద్ద విగ్రహాలన్నిటినీ ఊరేగింపుగా తీసుకుపోయి సాగ నంపుతారు. భారీ డోళ్లు, భేరీలు, పోర్టబుల్ డీజే సెట్లు విగ్రహాలతో పాటే ట్రక్కులపై జలాశయాలకు సాగిపోతాయి. శుభ శకునాల వేల్పును, పూజిం చడం కోసం పందిళ్లకు తరలించేటప్పుడు కూడా అవన్నీ వెంట ఉండాల్సిందే.
ముంబై హైకోర్టు దహీహండిలో పాల్గొనే వారి ప్రాణ రక్షణ కోసం, కాళ్లుచేతుల రక్షణ కోసం ఉట్టి కట్టే ఎత్తు మీద, అందులో పాల్గొనేవారి వయసుపైన ఆంక్షలను విధించినప్పుడు... నిర్వాహకులు, ప్రధా నంగా రాజకీయవేత్తలు అది ఒక ‘సాహస క్రీడ’ అంటూ వాదించడం ఆసక్తికరం. ఇది అవకాశవాదా నికి సుస్పష్టమైన ఉదాహరణ. ఈ కేసులో, హైకోర్టు తీర్పును సమీక్షించాలని సుప్రీం కోర్టు కోరింది. దీంతో అది వాటిని నియంత్రించే పని చట్టసభల పనే తప్ప తాము చేయజాలమంటూ మునుపటి యథాతథస్థితి కొనసాగింపును పునరుద్ధరించింది.
గణేశ్ చతుర్థికి రాజకీయపరమైన ప్రాపకం కూడా భారీ ఎత్తున ఉంది. అది స్థానిక రాజకీయ వేత్తలు అందించే దానికే పరిమితం కాదు. పైగా ఇది లాభసాటి వ్యవహారం కూడా. చిన్న సంస్థలు చిన్న విగ్రహాలను ఎంచుకుని, అక్రమంగా రోడ్డు స్థలా లను ఆక్రమిస్తాయి. అందుకోసం అవి రాజకీయ వేత్తల మద్దతును కోరతాయి. ఎన్నికల సమ యంలో చిన్న గృహ సముదాయాల ప్రాతిపదికపై ఏర్పడ్డ బృందాలు రాజకీయవేత్తల నుంచి నిధులను కోరతాయి. ‘దానికి బదులు’గా ఓటును ఆశించి ఆశించి వారు సమర్పించుకోడానికి అంగీకరిస్తారు.
ధ్వని కాలుష్య నిరోధం గురించి ప్రభుత్వ చట్టా లున్నా నిర్వాహకులకు దాదాపుగా ఆ పట్టింపే ఉండదు. శబ్ద కాలుష్యం తాత్కాలికమైనదే అయినా, శాశ్వతమైన నష్టాన్ని కలగజేయగలదని రుజువైంది. నగరాలు, పట్టణాలలో అన్ని వైపులా చుట్టేసి వ్యాపించే శబ్ద కాలుష్యం... గణేశ్ చతుర్థి వంటి పండుగల సమయంలో మరింత ఎక్కువగా పెరుగు తున్నదే తప్ప తగ్గడం లేదని మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అధ్యయనాలు తేల్చి చెప్పాయి.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com
మహేష్ విజాపృకర్