వార్తల స్థానంలో అరుపులా? | shouting replaces in news hours | Sakshi
Sakshi News home page

వార్తల స్థానంలో అరుపులా?

Published Tue, Feb 23 2016 12:57 AM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM

వార్తల స్థానంలో అరుపులా? - Sakshi

వార్తల స్థానంలో అరుపులా?

విశ్లేషణ
ఏం జరగనుందో ఊహించి చెప్పే ఒక సూచనాత్మక సర్వే చేయండి. తామేం పొందగల మని భావించామో -ప్రశాం తంగా చెప్పే స్పష్టమైన వార్తలు - దాన్ని పొందలేదని చాలా మంది టెలివిజన్ వార్తల వీక్షకు లు మీకు చెబుతారు. కనీసం ప్రాంతీయ చానళ్లలా కాకుండా దేశవ్యాప్త వీక్షకులకు అందుబాటులో ఉండే ఇంగ్లిష్, హిందీ ప్రాంత చానళ్లకు ఇది వర్తిస్తుంది. టీవీ మాధ్యమాన్ని విశ్వసించలేమని మీకు చాలామందే చెబుతారు.

పైన పేర్కొన్న కారణాల వల్లే తాను సాధారణంగా టీవీని చూడనని ప్రజాదరణ ఉన్న ఎన్డీటీవీ హిందీ న్యూస్ చానల్ యాంకర్ రవీష్ కుమార్ మీకు చెప్పినప్పుడు వాటిని మీరు సీరియస్‌గానే తీసుకోవాలి. ఒకానొక టీవీ చర్చను ప్రారంభించడానికి ముందుగా చర్చించవలసిన అంశం గురించి క్లుప్తంగా తాను ముందే హోస్ట్‌లకు వివరించానని, చర్చలో పాల్గొనేవారు నేరుగా చర్చించడాన్ని తాను అనుమతించలేదని రవీష్ చెప్పారు. ఒక యాంకర్‌గా తాను కూడా తప్పులు చేసి ఉంటానని రవీష్ అంగీకరించారు కానీ టీవీ మాధ్యమంపై తన ఆరోపణ స్థాయిని అది తగ్గించబోదని స్పష్టం చేశారు.

 గత శుక్రవారం నాడు, టెలివిజన్ వార్తల్లో ఎక్కడ తప్పు ఉందో తన పాఠకులకు చెప్పాలని రవీష్ నిర్ణయించుకున్నారు. టీవీ వార్తలు రోగగ్రస్తమై పోయాయి. అవి ప్రజలను కూడా రోగగ్రస్తులను చేశాయి. ఆ స్థితిలోనే వండివార్చుతున్న వాటిని వారు ఆమోదిస్తూ దాంట్లోనే వినోదాన్ని కనుగొంటున్నారని ఆయన చెప్పారు. టీవీ మాధ్యమానికి  టీఆర్‌పీలను ఇవ్వడంపై శ్రోతలు చురుగ్గా ఎందుకున్నారనే విషయం ఆయన అవగాహనకు అవతలే ఉంది. దిగ్భ్రాంతి కలిగించే తీరులో ఆయన తన అభిప్రాయాన్ని బయటపెట్టారు!! విజువల్స్‌ను తను స్విచ్ ఆఫ్ చేశారు. కాబట్టి తాను ప్రశాంతంగా వర్ణిస్తున్న దాన్ని  సావధానంగా శ్రోతలు వినగలరు.

 అరకొర జ్ఞానం కలిగిన యాంకర్ పరిధికి అవతల ఉండే ప్రధానమైన పరిణామంపై నిర్దిష్ట అవగాహనను కల్గించడం కోసం ఒక నిపుణుడి అభిప్రాయాన్ని అందించే లక్ష్యంతో టీవీ అనేది ప్రారంభంలో చర్చను తీసుకువచ్చేది. నిదానంగా ఈ చర్చలు ప్రైమ్ టైమ్‌లోని వార్తలను దాటుకుని ఎలాంటి వార్తనైనా చర్చనీయాంశంగా మార్చేశాయి. అవి అభిప్రాయాలను రువ్వే మల్లయుద్ధ గోదాలుగా  మారిపోయాయి. సమాచారాన్ని తెలియచే యడానికి బదులుగా యాంకర్లు, అతిథులు తమతో సహా ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుంటూ తీవ్రమైన చర్చా విస్ఫోటనలలో మునిగిపోవడం ప్రారంభించారు.

 ఒక గౌరవనీయుడైన యాంకర్‌నుంచి అంటే పరిశ్రమ లోపలి నుంచే ఈ విషాద విలాపం వచ్చింది. దురదృష్టవశాత్తూ ఈయన హిందీకి మాత్రమే పరిమితం కాడు. ఈయనది ఒక చురుకైన బుద్ధి. ఒక రిపోర్టరుగా తన ప్రైమ్ టైమ్‌ను వీధిలోని కెమెరాగా మార్చడాన్ని అధిగమించలేడు. టీవీ మాధ్యమంలోని పరిణామాలు ఇప్పుడున్నంత చెడుగా లేనట్లయితే ఇంతటి బాధాకరమైన వాణి బయటకు వచ్చేది కాదు.  ఒక దిగ్భ్రాంతి, విస్మయంతో కూడిన వ్యూహాన్ని అతడు ఇలా ఉపయోగించినప్పటికీ, సంవత్సరం క్రితం అత్యాచార సమస్యపై తీసిన ఇండియాస్ డాటర్స్‌పై నిషేధానికి వ్యతిరేకంగా నిరసన తెలుపడంలో మీడియా ఇదేవిధమైన శూన్యతలో ఉండి చర్చకు తావీయలేదు. ట్వీటర్ ఈ అంశంపై రగుల్కొనలేదు. ఇంటర్నెట్ ఉరిపోసుకోలేదు. అయితే సంతోషకరమైన విషయం ఏమిటంటే, నేను ఈ విషయంపై ఒక పోర్టల్‌లో రాసినప్పుడు తొలి 24 గంటల్లోనే దాదాపుగా 2 వేల ఫేస్‌బుక్ షేర్లు వచ్చాయి.

 నల్లతెర గురించి రవీష్ చెప్పిన దాని క్రోడీకరణ ఇక్కడ చూద్దాం. ఒకటి, నల్లతెర అనేది న్యూస్ టీవీ డార్క్ స్థితికి సంబంధించిన రూపకం వంటిది. రెండు, అభిప్రాయ సృష్టి అనేది కొద్దిమంది వ్యాఖ్యాతలు, యాంకర్లకే పరిమితమైంది. ఇక్కడ కూడా, సరైన సమాచారం అందని రీతిలో ఉంటుంది. అతిథులు తమ ప్రత్యర్థి మాట్లాడవలసిన సమయాన్ని తిరస్కరిస్తూ కాలయాపన చేస్తుంటారు. ఒకరినుంచి మరొకరు వినేది మరొక చానల్‌లో అదే విధమైన షోను భ్రమింపజేస్తుంటుంది.

 మరే దేశంకన్నా ఎక్కువ వార్తా చానళ్లు బహుశా మనదేశంలో ఉంటాయి కానీ వీటిలో అన్నీ డబ్బు సంపాదించడం లేదు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్దిష్టమైన కథనం కోసం రిపోర్టర్‌ను పంపించడం కాకుండా తమ ప్యానెల్‌లో వాగ్యుద్ధాన్ని తీవ్రస్థాయిలో కొనసాగించే అతిథిని తీసుకురావడం చవకైనది అని వారు గ్రహించి ఉండొచ్చని నా అభి ప్రాయం. ఢిల్లీని మినహాయిస్తే ఏ నగరంలోనూ తగిన టీమ్ అన్నది లేదు. ముంబై వంటి మెట్రోపోలిటన్ నగరాల్లో కూడా ప్రధానమైన టీవీ నెట్‌వర్క్‌లు బహుశా ముగ్గురు రిపోర్టర్లనే కలిగి ఉంటున్నాయి. స్పష్టంగానే వీరి వ్యవహారం ఏమిటంటే, అభిప్రాయాలను మల్చడమే కానీ, వార్తలను మల్చడం కాదు.
 
ప్రైవేట్ న్యూస్ టీవీ చానల్స్ వాటిని ఏర్పర్చిన లక్ష్యాన్ని ఇప్పుడు కోల్పోయాయి. దూరదర్శన్ ఒక దృశ్యరూపంలోని ఆల్ ఇండియా రేడియోగా ఉంటున్నందుకుగాన్ని మనమంతా అవహేళన చేస్తున్న సమయంలో ప్రైవేట్ న్యూస్ టీవీ చానళ్లు దూరదర్శన్ స్థానాన్ని భర్తీ చేశాయి. ఒక సంవత్సరం పాటుగా ఈ చానళ్లు ఒక దృశ్య మినహాయింపుగా మాత్రమే ఉంటూ స్తంభించిపోయిన స్థితిలో ఉన్నాయి. పైగా ఈ విజువల్స్‌లో కూడా చాలా భాగం ఒకే సమాచార ప్రదాత నుంచి వస్తున్నాయి. గతంలోని దూరదర్శన్ లాగా స్క్రీన్‌మీద మాట్లాడుతున్న తలలను ఇప్పుడు చూస్తుంటారు. కనీసం నిర్ధారించుకోకుండానే వార్తలు ముక్కలు ముక్కలుగా వేరైపోయాయి. ఇదే ఇపుడు టీవీ చానళ్లను మినహాయించి చూస్తే వీక్షకులకు, ప్లేయర్లకు విషయాన్ని మరింత సంక్లిష్టం చేస్తోంది.

http://img.sakshi.net/images/cms/2015-03/41427657601_295x200.jpg
 

 

 

 

 

 

 


 వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
 ఈమెయిల్: mvijapurkar@gmail.com
 మహేష్ విజాపుర్కార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement