- అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు
దాతల సహాయం కోసం...
Published Fri, Oct 7 2016 10:57 PM | Last Updated on Tue, Sep 3 2019 8:56 PM
ఏలేశ్వరం :
అందరితో కలిసి పాఠశాలకు వెళ్లవల్సిన ఆ బాలుడు అరుదైన వ్యాధి సోకడంతో మంచానికి పరిమితమై చికిత్స పొందుతున్నాడు. అతని తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతల సహయం కోసం ఎదురుచూస్తున్నారు. ఏలేశ్వరానికి చెందిన గోపాలదాసు నూకరాజు కుమారుడైన దుర్గాప్రసాద్(12)కు గులియన్ బ్యారీసిండ్రోమ్(జీబీఎస్) వ్యాధి సోకింది. ఈవ్యాధి కారణంగా నరాలు చచ్చుపోవడంతో దుర్గప్రసాద్‌ను కాకినాడలోని అమృత మల్టిస్పెషాలిటీ ఆస్పత్రిలో గత 45 రోజులుగా చికిత్స అందిస్తున్నారు. కూలీ పనులు చేసుకుని జీవిస్తున్న నూకరాజు తన ఆస్తిపాస్తులను అమ్మి సుమారు రూ.5 లక్షల వరకు వైద్యానికి ఖర్చుచేశాడు. దీంతో దుర్గప్రసాద్ ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడింది. పూర్తిస్థాయిలో కోలుకొనేందుకు మరో రూ.5 లక్షలు ఖర్చుఅవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో పట్టణానికి చెందిన జీసస్ మినిస్ట్రీస్ సంస్థ దాతల çసాయాన్ని కోరుతున్నది. దాతలు సెల్ నంబర్ 94401 68778, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కౌంట్ నంబర్– 328501010020006 కోడ్–వీబీఐఎన్ 0532851కు సాయం చేయాలని కోరుతున్నారు.
Advertisement