న్యూఢిల్లీ:అగ్నిపథ్ స్కీమ్‌పై దేశ ప్రజలకు తామిచ్చిన హామీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)పరిధిలోకే వస్తుందని ఎన్నికల కమిషన్(ఈసీ)కి కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
ఈ మేరకు పార్టీ ఈసీకి ఒక లేఖ రాసింది. సాయుధ దళాలను రాజకీయం చేయవద్దని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఈసీ సూచించిన నేపథ్యంలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
అగ్నిపథ్ స్కీమ్ విషయమై శుక్రవారం(మే24) ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎక్స్ సర్వీస్‌మెన్ విభాగం చీఫ్ కల్నల్ రోహిత్ మీడియా సమావేశంలో స్పందించారు. ‘సాయుధ దళాలు దేశ భద్రత కోసం గొప్పగా పనిచేస్తున్నాయి. మేం కేవలం అగ్నిపథ్ స్కీమ్ గురించే మట్లాడుతున్నాం.
ఈ స్కీమ్‌ను తీసుకువచ్చి ఆర్మీని మోదీ ప్రభుత్వం బలహీనపరిచింది. ఈ స్కీమ్ దేశ ప్రజలు, ఆర్మీ జవాన్ల ప్రయోజనాలకు ఎంత మాత్రం మేలు చేయదు. అందుకే రద్దు చేస్తాం’అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment