
బెంగళూరు: మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎన్నికల నియమావళి)ను ఉల్లంఘించారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై బీజేపీ ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేసింది. కర్ణాటక అసెంబ్లీ విధాన సౌధలోని డీకే శివకుమార్ ఆఫీసును పార్టీ కార్యక్రమాలకు వాడుతున్నారని ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. ‘విధాన సౌధలోని తన ఆఫీసును కాంగ్రెస్ ఆఫీసులా డీకే శివకుమార్ భావిస్తున్నారు.
శనివారం(మార్చ్ 30) ఆయన తన విధాన సౌధ ఆఫీసులో నజ్మా నజీర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పూర్తిగా ఉల్లంఘించడమే’ అని డీకే శివకుమార్‌పై ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్‌కుమార్ తెలిపారు. ఈ విషయంలో డీకే శివకుమార్‌పై కఠిన చర్యలు తీసుకుని గట్టి సందేశం పంపాలని ఎన్నికల కమిషన్‌ను ఈ సందర్భంగా సురేష్ కుమార్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment