లండన్: ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ల సందర్భంగా ఆతిథ్య జట్లకు అనుకూలంగా పిచ్‌లను తయారుచేసుకోవడంపై ఐసీసీ క్రికెట్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. టెస్టు ఫార్మాట్ భవిష్యత్‌పై అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఈ కమిటీ శుక్రవారం సమావేశమైంది. విదేశీ పర్యటనల్లో ఆయా జట్లకు స్పిన్, మరికొన్ని చోట్ల బౌన్సీ పిచ్‌లు ఎదురయ్యే విష యం తెలిసిందే.
ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్జాతీయ క్రికెట్ స్వరూపాన్ని మార్చాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. అలాగే బ్యాట్స్‌మెన్ వాడే బ్యాట్ల పరిమాణంపై కచ్చితత్వంతో ఉండాలని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)కి కమిటీ సూచించింది. ఈ సమావేశానికి ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్, మీడియా ప్రతినిధిగా ఉన్న రవిశాస్త్రి హాజరుకాలేదు.
పిచ్‌ల నాణ్యతపై ఐసీసీ ఆందోళన
Published Sat, Jun 4 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM
Advertisement