
భారత జట్టులో స్థానమే లక్ష్యం కావాలి
► కేడీసీఏ అధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి
కడప స్పోర్ట్స్: దేశానికి ప్రాతినిథ్యం వహించడ మే మీ లక్ష్యం కావాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్కూల్ ఆఫ్ అండర్–14 అకాడమీ చైర్మన్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి ఆకాంక్షించారు. గురువారం రాత్రి నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ నెట్స్‌లో అండర్–14 క్రీడాకారుల ఫేర్‌వెల్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకట శివారెడ్డి మాట్లాడుతూ గోకరాజు గంగరాజు సారధ్యంలో దేశంలోనే తొలి అకాడమీ కడప నగరంలో ఏర్పాటు చేశామన్నారు. అండర్–16, అండర్–19 అకాడమీలతో పాటు ప్రస్తుతం అండర్–14 అకాడమీని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే కాలంలో ఏసీఏ నుంచి పలువురు క్రీడాకారులు దేశానికి ప్రాతినిథ్యం వహించేలా సన్నద్ధం కావాలని సూచించారు. ఏసీఏ స్కూల్ ఆఫ్ అండర్–14 అకాడమీ కన్వీనర్, సౌత్‌జోన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు ప్రసంగించారు.
పరిపాలనాధికారికి సన్మానం..: ఏసీఏ స్కూల్ ఆఫ్ అండర్–14 అకాడమీ పరిపాలనాధికాగా ఉన్న బాబ్జి బదిలీ కావడంతో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో నూతన ఏఓ శ్రీనివాస్, కోచ్‌లు మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసులు, కిశోర్, ట్రైనర్ ఆనంద్ పాల్గొన్నారు.