హిమాచల్ ప్రదేశ్ 198/4
శశికాంత్‌కు 3 వికెట్లు
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్ శశికాంత్ మూడు వికెట్లతో మెరిశాడు. గ్రూప్ ‘బి’లో భాగంగా విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న పోరులో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
అంకిత్ (53; 3 ఫోర్లు), ఆకాశ్ వశిష్ట్ (52 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఓపెనర్లు శుభమ్ అరోరా (16), ప్రశాంత్ చోప్రా (10)తో పాటు... ఏకాంత్ సేన్ (20) విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్ 3 వికెట్లు పడగొట్టగా... విజయ్ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 295/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 92.4 ఓవర్లలో 344 పరుగులకు ఆలౌటైంది. ఆదివారం 49 పరుగులు చేసి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది.
మనీశ్ (42; 4 ఫోర్లు), త్రిపురాణ విజయ్ (33; 2 ఫోర్లు) చివర్లో కీలక పరుగులు చేశారు. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో దివేశ్ శర్మ 5 వికెట్లు పడగొట్టగా... రిషీ ధావన్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆంధ్ర జట్టు దీటుగా బదిలిస్తున్న హిమాచల్ ప్రదేశ్ జట్టు ఇంకా 146 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉండగా... కెపె్టన్ రిషీ ధావన్ (38 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఆకాశ్ వశి‹Ù్ట క్రీజులో ఉన్నారు.
స్కోరు వివరాలు
ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: అభిõషేక్ రెడ్డి (ఎల్బీ) (బి) రిషీ ధావన్ 5; మహీప్ కుమార్ (ఎల్బీ) (బి) రిషీ ధావన్ 4; షేక్ రషీద్ (బి) అరి్పత్ 69; హనుమ విహారి (సి) రిషీ ధావన్ (బి) ముకుల్ నేగీ 66; శ్రీకర్ భరత్ (సి) ఆకాశ్ (బి) దివేశ్ శర్మ 65; అశ్విన్ హెబ్బర్ (సి) ఏకాంత్ సేన్ (బి) దివేశ్ శర్మ 15; మనీశ్ (సి) ముకుల్ నేగీ (బి) దివేశ్ శర్మ 42; త్రిపురాణ విజయ్ (సి) ఆకాశ్ వశి‹Ù్ట (బి) రిషీ ధావన్ 33; శశికాంత్ (సి) శుభమ్ అరోరా (బి) దివేశ్ శర్మ 6; లలిత్ మోహన్ (సి) శుభమ్ అరోరా (బి) దివేశ్ శర్మ 14; సత్యనారాయణ రాజు (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (92.4 ఓవర్లలో ఆలౌట్) 344. వికెట్ల పతనం: 1–5, 2–11, 3–136, 4–202, 5–226, 6–245, 7–317, 8–321, 9–341, 10–344. బౌలింగ్: వినయ్ 9–0–41–0; రిషీ ధావన్ 19–3–80–3; అర్పిత్ గులేరియా 11–0–47–1; దివేశ్ శర్మ 20.4–4–60–5; మయాంక్ డాగర్ 18–2–53–0; ముకుల్ నేగీ 15–2–52–1.
హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 16; ప్రశాంత్ చోప్రా (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 10; అంకిత్ (బి) విజయ్ 53; ఏకాంత్ సేన్ (బి) శశికాంత్ 20; ఆకాశ్ వశిష్ట్ (బ్యాటింగ్) 52; రిషీ ధావన్ (బ్యాటింగ్) 38; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (65 ఓవర్లలో 4 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–12, 2–31, 3–59, 4–124. బౌలింగ్: శశికాంత్ 15–6–50–3; సత్యనారాయణ రాజు 14–1–40–0; లలిత్ మోహన్ 11–1–26–0; విజయ్ 13–1–41–1; మహీప్ కుమార్ 4–1–10–0; మనీశ్ 7–0–28–0; రషీద్ 1–0–2–0.
Comments
Please login to add a commentAdd a comment