రంజీ ట్రోఫీ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన టాప్-4 బ్యాటర్లు సెంచరీలు చేశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇలా జరగడం ఇది రెండో సారి మాత్రమే. 2019 ఎడిషన్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా టాప్-4 ఆటగాళ్లు సెంచరీలు చేశారు.
నాడు అమోన్కర్ (160), గోవెకర్ (160), స్మిత్ పటేల్ (137 నాటౌట్), అమిత్ వర్మ (122 నాటౌట్) మూడంకెల స్కోర్‌ను చేశారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిమాచల్ టాప్-4 బ్యాటర్లు శుభమ్ అరోరా (11), చోప్రా (171), అంకిత్ కల్సి (205 నాటౌట్), ఏకాంత్ సేన్ (101) సెంచరీలు చేశారు. ఓవరాల్‌గా ఫస్టక్లాస్ క్రికెట్ చరిత్రలో ఇలా టాప్-4 బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది 14వ సారి.
మ్యాచ్ విషయానికొస్తే.. టాప్-4 బ్యాటర్లు సెంచరీలతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన హిమాచల్ తొలి ఇన్నింగ్స్‌ను 663 పరుగుల వద్ద (3 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. డబుల్ సెంచరీ చేసిన అంకిత్ కల్సితో పాటు మయాంక్ డాగర్ (56) క్రీజ్‌లో ఉన్నాడు. ఉత్తరాఖండ్ బౌలర్లలో మయాంక్ మిశ్రా, స్వప్నిల్ సింగ్, యువరాజ్ చౌదరీ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. కెప్టెన్ రవికుమార్ సమర్థ్ 21 పరుగులు చేసి ఔట్ కాగా.. అవ్‌నీశ్ సుధా (24), వైభవ్ బట్ (1) క్రీజ్‌లో ఉన్నారు. రవికుమార్ వికెట్ వైభవ్ అరోరాకు దక్కింది. హిమాచల్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఉత్తరాఖండ్ ఇంకా 613 పరుగులు వెనుకపడి ఉంది.
చదవండి: మాహారాజు కాబోతున్న టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరంటే?
Comments
Please login to add a commentAdd a comment