Shashi Kant
-
శశికాంత్ మెరిపించినా...
ముంబై: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆంధ్ర జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 5 వికెట్ల తేడాతో మహారాష్ట్ర చేతిలో ఓడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శశికాంత్ (25 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ షాట్లతో అజేయ అర్ధశతకం సాధించాడు. అశ్విన్ హెబర్ (85 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్), షేక్ రషీద్ (75 బంతుల్లో 42; 2 ఫోర్లు, 1 సిక్స్), రికీ భుయ్ (47 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్), వినయ్ కుమార్ (40 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. ఈ టోర్నీలో ఫుల్ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శ్రీకర్ భరత్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో ఆంధ్ర జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఆఖర్లో శశికాంత్ భారీ షాట్లతో విరుచుకుపడటంతో పోరాడే స్కోరు చేయగలిగింది. మహారాష్ట్ర బౌలర్లలో రజనీశ్ గుర్బానీ 3, ముకేశ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం మహారాష్ట్ర 47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిద్ధేశ్ వీర్ (124 బంతుల్లో 115 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా... రాహుల్ త్రిపాఠి (78 బంతుల్లో 69; 9 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. ఆంధ్ర బౌలర్లలో సందీప్ 2 వికెట్లు తీశాడు. గ్రూప్‌లో 6 మ్యాచ్‌లాడిన ఆంధ్ర 4 విజయాలు, 2 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానంలో ఉంది. -
ఆంధ్ర 344 ఆలౌట్
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్ శశికాంత్ మూడు వికెట్లతో మెరిశాడు. గ్రూప్ ‘బి’లో భాగంగా విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న పోరులో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అంకిత్ (53; 3 ఫోర్లు), ఆకాశ్ వశిష్ట్ (52 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఓపెనర్లు శుభమ్ అరోరా (16), ప్రశాంత్ చోప్రా (10)తో పాటు... ఏకాంత్ సేన్ (20) విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్ 3 వికెట్లు పడగొట్టగా... విజయ్ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 295/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 92.4 ఓవర్లలో 344 పరుగులకు ఆలౌటైంది. ఆదివారం 49 పరుగులు చేసి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. మనీశ్ (42; 4 ఫోర్లు), త్రిపురాణ విజయ్ (33; 2 ఫోర్లు) చివర్లో కీలక పరుగులు చేశారు. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో దివేశ్ శర్మ 5 వికెట్లు పడగొట్టగా... రిషీ ధావన్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆంధ్ర జట్టు దీటుగా బదిలిస్తున్న హిమాచల్ ప్రదేశ్ జట్టు ఇంకా 146 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉండగా... కెపె్టన్ రిషీ ధావన్ (38 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఆకాశ్ వశి‹Ù్ట క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: అభిõషేక్ రెడ్డి (ఎల్బీ) (బి) రిషీ ధావన్ 5; మహీప్ కుమార్ (ఎల్బీ) (బి) రిషీ ధావన్ 4; షేక్ రషీద్ (బి) అరి్పత్ 69; హనుమ విహారి (సి) రిషీ ధావన్ (బి) ముకుల్ నేగీ 66; శ్రీకర్ భరత్ (సి) ఆకాశ్ (బి) దివేశ్ శర్మ 65; అశ్విన్ హెబ్బర్ (సి) ఏకాంత్ సేన్ (బి) దివేశ్ శర్మ 15; మనీశ్ (సి) ముకుల్ నేగీ (బి) దివేశ్ శర్మ 42; త్రిపురాణ విజయ్ (సి) ఆకాశ్ వశి‹Ù్ట (బి) రిషీ ధావన్ 33; శశికాంత్ (సి) శుభమ్ అరోరా (బి) దివేశ్ శర్మ 6; లలిత్ మోహన్ (సి) శుభమ్ అరోరా (బి) దివేశ్ శర్మ 14; సత్యనారాయణ రాజు (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (92.4 ఓవర్లలో ఆలౌట్) 344. వికెట్ల పతనం: 1–5, 2–11, 3–136, 4–202, 5–226, 6–245, 7–317, 8–321, 9–341, 10–344. బౌలింగ్: వినయ్ 9–0–41–0; రిషీ ధావన్ 19–3–80–3; అర్పిత్ గులేరియా 11–0–47–1; దివేశ్ శర్మ 20.4–4–60–5; మయాంక్ డాగర్ 18–2–53–0; ముకుల్ నేగీ 15–2–52–1. హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 16; ప్రశాంత్ చోప్రా (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 10; అంకిత్ (బి) విజయ్ 53; ఏకాంత్ సేన్ (బి) శశికాంత్ 20; ఆకాశ్ వశిష్ట్ (బ్యాటింగ్) 52; రిషీ ధావన్ (బ్యాటింగ్) 38; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (65 ఓవర్లలో 4 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–12, 2–31, 3–59, 4–124. బౌలింగ్: శశికాంత్ 15–6–50–3; సత్యనారాయణ రాజు 14–1–40–0; లలిత్ మోహన్ 11–1–26–0; విజయ్ 13–1–41–1; మహీప్ కుమార్ 4–1–10–0; మనీశ్ 7–0–28–0; రషీద్ 1–0–2–0. -
హడలెత్తించిన శశికాంత్
సాక్షి, ఒంగోలు: ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆంధ్ర రంజీ క్రికెట్ జట్టు బౌలర్ కేవీ శశికాంత్ తన పేస్ పదును మరోసారి ప్రదర్శించాడు. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. ఫలితంగా ఆంధ్ర జట్టుతో ఇక్కడి సీఎస్ఆర్ శర్మ కాలేజీ మైదానంలో మొదలైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకే ఆలౌటైంది. శశికాంత్ 60 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. తన్మయ్, అక్షత్ రెడ్డి, మల్లికార్జున్, సీవీ మిలింద్, హిమాలయ్ అగర్వాల్‌లను శశికాంత్ అవుట్ చేశాడు. మరో బౌలర్ యెర్రా పృద్విరాజ్ మూడు వికెట్లు తీయగా... పైడికాల్వ విజయ్ కుమార్, బండారు అయ్యప్ప ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ సీజన్లో ఓ ఇన్నింగ్స్‌లో నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం శశికాంత్‌కిది ఐదోసారి. ఇందులో మూడుసార్లు ఐదేసి వికెట్ల చొప్పున, రెండుసార్లు నాలుగేసి వికెట్ల చొప్పున తీశాడు. హైదరాబాద్ జట్టులో జావీద్ అలీ (161 బంతుల్లో 98; 16 ఫోర్లు) తప్ప మిగతా ప్లేయర్లు చేతులెత్తేశారు. జావీద్ రెండు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. అనంతరం ఆంధ్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ (4 బ్యాటింగ్; ఫోరు), ప్రశాంత్ (9 బ్యాటింగ్; ఫోరు) క్రీజులో ఉన్నారు. విజయ్ రికార్డు... ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీయడం ద్వారా విజయ్ కుమార్ రంజీల్లో ఆంధ్ర తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. కెరీర్లో 71వ రంజీ మ్యాచ్ ఆడుతున్న విజయ్ 243 వికెట్లు తీశాడు. షాబుద్దీన్ (75 మ్యాచ్‌ల్లో 242 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును విజయ్ బద్దలు కొట్టాడు. -
మెరిసిన శశికాంత్, స్టీఫెన్
జైపూర్: పేస్ బౌలర్లు కోడిరామకృష్ణ వెంకట శశికాంత్ (4/50), చీపురుపల్లి స్టీఫెన్ (4/67) మరోసారి చెలరేగడంతో... రాజస్తాన్‌తో శుక్రవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో తొలి రోజు ఆంధ్ర జట్టు పైచేయి సాధించింది. ఆంధ్ర బౌలర్ల ధాటికి రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 49.5 ఓవర్లలో కేవలం 151 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 2 వికెట్లకు 82 పరుగులు చేసింది. ప్రస్తుతం ఓపెనర్ జ్ఞానేశ్వర్ (32 బ్యాటింగ్; 5 ఫోర్లు), రికీ భుయ్ (10 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రశాంత్ కుమార్ (31; 5 ఫోర్లు), కెపె్టన్ హనుమ విహారి (0) అవుటయ్యారు. మరో 70 పరుగులు చేస్తే ఆంధ్ర జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభిస్తుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ కుదురుగా కనిపించలేదు. అశోక్ మేనరియా (74; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా వెళ్లారు. తాజా రంజీ సీజన్లో ఒకే ఇన్నింగ్స్‌లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం శశికాంత్, స్టీఫెన్‌లకు ఇది నాలుగోసారి కావడం విశేషం. హైదరాబాద్ వేదికగా కేరళతో ఆరంభమైన మ్యాచ్‌లోనూ హైదరాబాద్ బౌలర్లు ఆకట్టుకున్నారు. రవి కిరణ్ (3/24), సిరాజ్ (2/36) రాణించడంతో కేరళ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. అంతకుముందు రోజు నగరంలో కురిసిన భారీ వర్షంవల్ల మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. అంపైర్‌తో గిల్ వాగ్వాదం... ఢిల్లీతో రంజీ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్, భారత ‘ఎ’ జట్టు కెపె్టన్ శుబ్‌మన్ గిల్ తనను అవుట్‌గా ప్రకటించిన ఫీల్డ్ అంపైర్‌తో గొడవకు దిగి విమర్శల పాలైయ్యాడు. గిల్ తన వ్యక్తిగత స్కోరు 10 వద్ద ఢిల్లీ మీడియం పేసర్ సుబోధ్ భాటి బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీనిపై ఫీల్డర్లు అప్పీల్ చేయగా అంపైర్ మొహమ్మద్ రఫీ... గిల్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన గిల్ అంపైర్ వద్దకు నేరుగా వెళ్లి బ్యాట్‌కు బంతి తగలలేదంటూ గొడవకు దిగాడు. దీంతో ఆ అంపైర్ స్క్వేర్ లెగ్ అంపైర్ పశి్చమ్ పాఠక్‌ను సంప్రదించి తన నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్నాడు. ఈ గొడవ కారణంగా మ్యాచ్ దాదాపు 10 నిమిషాల పాటు నిలిచిపోయింది. అయితే గిల్ మరో 13 పరుగులు మాత్రమే జోడించి అవుట్ కావడం గమనార్హం. గిల్ ప్రవర్తనపై తాము మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడం లేదని ఢిల్లీ జట్టు మేనేజర్ వివేక్ ఖురానా, ఢిల్లీ క్రికెట్ సంఘం జనరల్ సెక్రటరీ వినోద్ తిహారా తెలిపారు. మహారాష్ట్ర 44 ఆలౌట్ సర్వీసెస్ తో జరుగుతోన్న గ్రూప్ ‘సి’ రంజీ మ్యాచ్‌లో మహారాష్ట్ర 44 పరుగులకే కుప్పకూలింది. రంజీ చరిత్రలో మహారాష్ట్ర జట్టుకిది రెండో అత్యల్ప స్కోరు. 1941–1942 సీజన్లో నవా నగర్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర 39 పరుగులకే ఆలౌటైంది. సర్వీసెస్ బౌలర్ పూనమ్ పునియా 5 వికెట్లతో చెలరేగాడు. ఆట ముగిసే సమయానికి సర్వీసెస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 141 పరుగులు చేసి 97 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. -
అదరగొట్టిన ఆంధ్ర
సాక్షి, ఒంగోలు టౌన్: సొంత మైదానంలో ఆంధ్ర జట్టు సత్తా చాటింది. శుక్రవారం ముగిసిన గ్రూప్–‘ఎ’ రంజీ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన ఆంధ్ర 9 వికెట్ల తేడాతో ఏడు సార్లు రంజీ చాంపియన్ అయిన ఢిల్లీని చిత్తు చేసింది. ఆంధ్ర బౌలర్లు శశికాంత్ (5/41), స్టీఫెన్ (5/91) చెలరేగడంతో ఢిల్లీ తన రెండో ఇన్నింగ్స్‌లో 72.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది 16 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 2.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి 20 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ జ్ఞానేశ్వర్ (0) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా... సారథి హనుమ విహారి (4) త్వరగా అవుట్ అయ్యాడు. మనీశ్ (15 నాటౌట్; 3 ఫోర్లు), ప్రశాంత్ కుమార్ (1 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు. ఓవర్‌నైట్ స్కోరు 89/6తో చివరి రోజు ఆటను కొనసాగించిన ఢిల్లీని లలిత్ యాదవ్ (145 బంతుల్లో 55; 11 ఫోర్లు), వికాశ్ మిశ్రా (151 బంతుల్లో 36; 5 ఫోర్లు) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరు ఏడో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఢిల్లీకి ఇన్నింగ్స్ పరాభవాన్ని తప్పించారు. అర్ధ శతకంతో నిలకడగా ఆడుతున్న లలిత్ యాదవ్‌ను శశికాంత్ పెవిలియన్‌కు పంపగా... వికాశ్ మిశ్రాను స్టీఫెన్ వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్‌కు తెరపడటానికి ఎంతో సేపు పట్టలేదు. ఈ విజయంతో ఆంధ్ర ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. -
విజయం దిశగా ఆంధ్ర
సాక్షి, ఒంగోలు టౌన్: రికీ భుయ్ (313 బంతుల్లో 144 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీకి తోడు... బౌలింగ్‌లో చీపురుపల్లి స్టీఫెన్ (4/47), శశికాంత్ (2/24) హడలెత్తించడంతో... ఢిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్రికెట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఆంధ్ర విజయం దిశగా సాగుతోంది. 153 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 28 ఓవర్లలో 89 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ జట్టు ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మరో 64 పరుగులు చేయాలి. ప్రస్తుతం లలిత్ యాదవ్ (23 బ్యాటింగ్; 4 ఫోర్లు), వికాస్ మిశ్రా (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు మ్యాచ్‌కు చివరి రోజు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 249/6తో బ్యాటింగ్ కొనసాగించిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 127 ఓవర్లలో 368 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆంధ్రకు 153 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఒకదశలో 8 వికెట్లకు 250 పరుగులతో ఉన్న ఆంధ్ర జట్టుకు ఆధిక్యం 50 పరుగులు దాటుతుందో లేదో అనే అనుమానం కలిగింది. అయితే రికీ భుయ్ పట్టుదలతో ఆడి చివరి వరుస బ్యాట్స్‌మెన్ స్టీఫెన్ (60 బంతుల్లో 19; 3 ఫోర్లు)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 76 పరుగులు... విజయ్ కుమార్ (20 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్)తో కలిసి పదో వికెట్‌కు 42 పరుగులు జోడించి ఆంధ్రకు భారీ ఆధిక్యం లభించడంలో కీలకపాత్ర పోషించాడు. -
ఆంధ్ర ఇన్నింగ్ విజయం
హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు టోర్నీలో ఆంధ్ర జట్టు వైస్ కెప్టెన్ కె. వి. శశికాంత్ (53 నాటౌట్, 4/47, 7/61) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆ జట్టు... మధ్యప్రదేశ్‌పై ఇన్నింగ్స విజయాన్ని సాధించింది. కడపలో జరిగిన ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు తొలిఇన్నింగ్‌లో 61.4 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి బౌలర్లలో శశికాంత్ 4, వేణు 6 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆంధ్రజట్టు కరణ్ (73), ప్రణీత్ (55), శశికాంత్ (53నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 159 ఓవర్లలో 9 వికెట్లకు 362 పరుగుల వద్ద ఇన్నింగ్‌సను డిక్లేర్ చేసింది. దీంతో ఆంధ్రకు 215 పరుగుల తొలి ఇన్నింగ్స ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్‌సను ప్రారంభించిన మధ్యప్రదేశ్ శశికాంత్ (7/61) ధాటికి 57.1 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటై ఓడిపోరుుంది.