ఆంధ్ర ఇన్నింగ్‌‌ విజయం | Andhra inning victory | Sakshi
Sakshi News home page

ఆంధ్ర ఇన్నింగ్‌‌ విజయం

Published Fri, Nov 4 2016 12:19 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

ఆంధ్ర ఇన్నింగ్‌‌ విజయం - Sakshi

ఆంధ్ర ఇన్నింగ్‌‌ విజయం

హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు టోర్నీలో ఆంధ్ర జట్టు వైస్ కెప్టెన్ కె. వి. శశికాంత్  (53 నాటౌట్, 4/47, 7/61) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆ జట్టు... మధ్యప్రదేశ్‌పై ఇన్నింగ్‌‌స విజయాన్ని సాధించింది. కడపలో జరిగిన ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు తొలిఇన్నింగ్‌‌లో 61.4 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి బౌలర్లలో శశికాంత్ 4, వేణు 6 వికెట్లు పడగొట్టారు.

అనంతరం ఆంధ్రజట్టు కరణ్ (73), ప్రణీత్ (55), శశికాంత్ (53నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 159 ఓవర్లలో 9 వికెట్లకు 362 పరుగుల వద్ద ఇన్నింగ్‌‌సను డిక్లేర్ చేసింది. దీంతో ఆంధ్రకు 215 పరుగుల తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్‌‌సను ప్రారంభించిన మధ్యప్రదేశ్ శశికాంత్ (7/61) ధాటికి 57.1 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటై ఓడిపోరుుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement