మెరిసిన విహారి, భరత్, రషీద్
హిమాచల్‌తో రంజీ మ్యాచ్
సాక్షి, విశాఖపట్నం: ప్రధాన బ్యాటర్లంతా రాణించడంతో రంజీ ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్‌తో పోరులో ఆంధ్ర జట్టు మంచి స్కోరు దిశగా సాగుతోంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ప్రారంభమైన పోరులో... తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. కెప్టెన్ షేక్ రషీద్ (69; 9 ఫోర్లు), హనుమ విహారి (66; 12 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించగా... వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (39 బంతుల్లో 65; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) టి20 తరహాల్లో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి హాఫ్ సెంచరీ చేశాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు అభిõÙక్ రెడ్డి (5), మహీప్ కుమార్ (4) విఫలం కావడంతో 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును రషీద్, విహారి ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిపోతున్న సమయంలో సంయమనం పాటించిన ఈ జోడీ... క్రీజులో కుదురుకున్నాక వేగంగా పరుగులు రాబట్టింది. రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించిన తర్వాత హనుమ విహారి వెనురదిగగా... షేక్ రషీద్‌తో కలిసి శ్రీకర్ భరత్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అప్పటి వరకు నిధానంగా సాగిన స్కోరుబోర్డు... భరత్ రాకతో పరుగులు పెట్టింది.
బౌలర్‌తో సంబంధం లేకుండా భరత్ ఎడాపెడి బౌండ్రీలతో విజృంభించాడు. ఇక మరింత భారీ స్కోరు చేయడం ఖాయమే అనుకుంటున్న దశలో వీరిద్దరూ వెనుదిరగడంతో పరుగుల వేగం తగ్గింది. అశ్విన్ హెబర్ (15) ఎక్కువసేపు నిలవలేకపోగా... మనీశ్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), త్రిపురన విజయ్ (20 బ్యాటింగ్; ఒక ఫోర్) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఏడ వికెట్‌కు అజేయంగా 50 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment