‘ఎంఆర్‌ఎఫ్’ శిక్షణకు స్టీఫెన్ | Bowler Cheepurupalli Stephen selected for MRF Pace Foundation Training | Sakshi
Sakshi News home page

‘ఎంఆర్‌ఎఫ్’ శిక్షణకు స్టీఫెన్

Published Wed, Apr 8 2015 1:40 AM | Last Updated on Sat, Jun 2 2018 2:19 PM

‘ఎంఆర్‌ఎఫ్’ శిక్షణకు స్టీఫెన్ - Sakshi

‘ఎంఆర్‌ఎఫ్’ శిక్షణకు స్టీఫెన్

సాక్షి, హైదరాబాద్ : ప్రఖ్యాత ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందేందుకు ఆంధ్ర క్రికెట్ జట్టు బౌలర్ చీపురుపల్లి స్టీఫెన్ ఎంపికయ్యాడు. పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ దగ్గర స్టీఫెన్ శిక్షణ తీసుకుంటాడు. ఈ నెల 15నుంచి ఈ శిక్షణా శిబిరం ప్రారంభమవుతుంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంనకు చెందిన 21 ఏళ్ల స్టీఫెన్ గత రెండు సీజన్లుగా ఆంధ్ర జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ ఇప్పటి వరకు 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 24.87 సగటుతో 39 వికెట్లు పడగొట్టాడు. ఎంఆర్‌ఎఫ్ ఫౌండేషన్‌లో శిక్షణకు ఎంపికైన స్టీఫెన్‌ను ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అభినందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement