Mrf Pace Foundation
-
భారత యువబౌలర్పై దిగ్గజ క్రికెటర్ ప్రశంసలు
సిడ్నీ: భారత యువబౌలర్ బసీల్ థంపీని ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ మెక్‌గ్రాత్ పొగడ్తలతో ముంచెత్తాడు. భారత్‌లో యువబౌలర్స్ సత్తా చాటుతున్నారని, భవిష్యత్తులో భారత్‌కు బలమైన పేస్ బౌలర్లు అందుబాటులోకి వస్తారని థంపీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఎమ్ఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్, క్రికెట్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మెక్‌గ్రాత్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. మెక్‌గ్రాత్ డైరెక్టర్‌గా ఉన్న ఎమ్ఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందిన ముగ్గురు యువబౌలర్లు బసీల్ థంపీ, అంకిత్ రాజ్‌పుత్, అనికేత్ చౌదరిలు దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత్-ఏ జట్టుకు ఎంపికయ్యారు. ముగ్గురు యువబౌలర్లు ఎంపికైనప్పటికే మెక్‌గ్రాత్ బసీల్ థంపీపైనే ప్రశంసలు కురిపించాడం విశేషం. డైరెక్టరైన మెక్‌గ్రాత్ శిక్షణలో భారత యువ బౌలర్లు శిక్షణ పొందారు. అకాడమీ శిక్షణలో రాటు దేలిన థంపీ ఐపీఎల్లో సత్తాచాటి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గెలిచకున్నాడని గుర్తు చేస్తూ కొనియాడాడు. ఇక ఈ అకాడమీలో ట్రైనీగా చేరి డైరెక్టర్‌గా సేవలందించడం సంతోషంగా ఉందని మెక్ గ్రాత్ తెలిపాడు. రాబోయే రోజుల్లో మరింత మంది పేస్ బౌలర్లను భారత్‌కు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత ఐదు సంవత్సరాల్లో యువ బౌలర్లు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. బసీల్ థంపీ ఐపీఎల్-10 గుజరాత్ లయన్స్ తరుపున 11 వికెట్లు పడగొట్టి దిగ్గజ ఆటగాళ్ల మన్ననలు పొందాడు. -
ఏఆర్ రెహ్మన్ ఇంటికి వెళ్లిన సచిన్
చెన్నై : వేర్వేరు రంగాలకు చెందిన సాధనకారులు ఒక చోట కలిస్తే కచ్చితంగా అది ఆసక్తికర విషయమే అవుతుంది. అలా సంగీతంలో ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్, క్రికెట్ క్రీడారంగంలో భారతరత్న అవార్డు గ్రహీత మాస్టర్ బ్లాస్టర్ సచ్చిన్ టెండుల్కర్‌ల అరుదైన కలయిక విశేషమే అవుతుంది. వీరి ఆత్మీయ కలయికకు స్థానికి కోడంబాకంలోని ఏఆర్.రెహ్మాన్ స్వగృహం పులకించింది. శుక్రవారం ఒక ట్రస్ట్ కార్యక్రమం కోసం చెన్నై వచ్చిన సచ్చిన్ తన మిత్రుడు ఏఆర్.రెహ్మాన్ ఇంటికెళ్లి ఆయనతో కొంత సేపు ముచ్చటించారు. పనిలో పనిగా సంగీతాన్ని ఎలా రూపొందిస్తారు? పాటలకు బాణీలు ఎలా కడతారన్న తన ఆసక్తిని సచిన్ ప్రశ్నల రూపంలో రెహ్మాన్ ముందుంచగా ఆయన కొన్ని బాణీలను కట్టి మిత్రుడి జిజ్ఞాసను తీర్చి సంతోషపరిచారు. అనంతరం సచిన్ మాట్లాడుతూ తాను ఏఆర్.రెహ్మాన్ అభిమానినన్నారు. మర్యాదపూర్వకంగానే ఆయన్ని కలిశానని వివరించారు.ఆ తరువాత సచిన్ నగరంలోని క్రికెట్ శిక్షణ మైదానాన్ని సందర్శించి అక్కడ తర్ఫీదు పొందుతున్న క్రీడాకారులకు కొన్ని సూచనలు ఇచ్చారు. -
‘ఎంఆర్ఎఫ్’ శిక్షణకు స్టీఫెన్
సాక్షి, హైదరాబాద్ : ప్రఖ్యాత ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందేందుకు ఆంధ్ర క్రికెట్ జట్టు బౌలర్ చీపురుపల్లి స్టీఫెన్ ఎంపికయ్యాడు. పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ దగ్గర స్టీఫెన్ శిక్షణ తీసుకుంటాడు. ఈ నెల 15నుంచి ఈ శిక్షణా శిబిరం ప్రారంభమవుతుంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంనకు చెందిన 21 ఏళ్ల స్టీఫెన్ గత రెండు సీజన్లుగా ఆంధ్ర జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ ఇప్పటి వరకు 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 24.87 సగటుతో 39 వికెట్లు పడగొట్టాడు. ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో శిక్షణకు ఎంపికైన స్టీఫెన్‌ను ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అభినందించింది.