తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల్లో క్రికెట్ కోసం మిని స్టేడియాన్ని నిర్మించనున్నట్లు నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు తెలిపారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లిగూడెంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలోని విమానాశ్రయ భూముల్లో ఆరుఎకరాల విస్తీర్ణంలో మిని క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నామని ఆయన ఈ మేరకు తెలిపారు.