IPL 2024 - Vizag: మార్చి 12 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రాక్టీస్‌ | IPL 2024: ACA Gopinath Reddy Held Meeting With DC Operations Team | Sakshi
Sakshi News home page

IPL 2024 - Vizag: మార్చి 12 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రాక్టీస్‌

Published Thu, Mar 7 2024 3:54 PM | Last Updated on Thu, Mar 7 2024 4:26 PM

IPL 2024: ACA Gopinath Reddy Held Meeting With DC Operations Team - Sakshi

సాక్షి, విశాఖపట్నం: నగరంలో మరోసారి ఐపీఎల్‌ సందడి నెలకొననుంది. మార్చి 31, ఏప్రిల్‌ 3న నిర్వహించనున్న మ్యాచ్‌లకు వైజాగ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. తొలి విడత షెడ్యూల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం హోం గ్రౌండ్‌గా నిలవనుంది. 

ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా అనుమతులు, పారిశుధ్యం, టిక్కెట్ల విక్రయం, పార్కింగ్‌ తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి  చర్చించారు.  

అదే విధంగా.. మార్చి 12 నుంచి 19 వరకు వైఎస్సార్‌ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ సభ్యులు ప్రాక్టీసు చేయనున్న నేపథ్యంలో.. ఆ మేరకు స్టేడియంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ ట్రెజరర్‌ ఏ.వి.చలం, సీఈవో ఎం.వి.శివారెడ్డి, సీఎఫ్‌ఓ ఎం.నవీన్‌ కుమార్, జనరల్‌ మేనేజర్లు ఎం.ఎస్‌.కుమార్, ఎస్‌.ఎం.ఎన్‌.రోహిత్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

వైజాగ్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు
మార్చి 31: ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌
ఏప్రిల్‌ 3: ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement