Dr YSR ACA VDCA Cricket Stadium
-
ప్రతిభ ఉన్న వారికే గుర్తింపు.. ఏపీఎల్-3 వేలంలో వాళ్లు సైతం!
సాక్షి, విశాఖపట్నం: ప్రతిభ ఉన్న వారికే గుర్తింపు దక్కుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి అన్నారు. అదే విధంగా క్రికెట్లో క్రమశిక్షణ ఎంతో అవసరం అని పేర్కొన్నారు.వీడీసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు ముగింపు సమావేశం శనివారం జరిగింది. విశాఖలోని డా. వైఎస్సార్ ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ప్రతిభ కలిగి.. గుర్తింపులేని క్రికెటర్లకు రైజింగ్ స్టార్స్ పేరుతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇటీవల చక్కటి వేదిక కల్పించాం.దీంతో ఏసీఏ విడుదల చేసిన వేలం అర్హత జాబితాలో లేని ఆటగాళ్లకు మరో అవకాశం వచ్చింది. ఇందులో భాగంగా మరోసారి ట్రయల్స్ నిర్వహించి ప్రతిభ చూపిన ఏడుగురికి ఏపీఎల్–3 వేలంలో స్థానం కల్పించాం’’ అని తెలిపారు.అదే విధంగా... ప్రతి క్రీడాకారుడి గణాంకాలతో కూడిన పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు వీలుగా ఈసారి సరికొత్త సాఫ్ట్ వేర్‌ను వినియోగిస్తున్నట్లు ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. అనంతరం క్రీడాకారులకు సర్టిఫికెట్లు, కోచ్‌లకు జ్ఞాపికలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ గేమ్ డెవలప్మెంట్ జనరల్ మేనేజర్ ఎం.ఎస్.కుమార్, వీడీసీఏ అధ్యక్ష, కార్యదర్శులు పి.విష్ణుకుమార్‌రాజు, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు -
వచ్చీరాగానే ఇరగదీశాడు.. ఎవరీ అంగ్క్రిష్ రఘువంశీ?
IPL 2024: Who Is Angkrish Raghuvanshi?: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మరో ప్రతిభావంతుడైన క్రికెటర్ వెలుగులోకి వచ్చాడు. ఇప్పటికే ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అభిషేక్ పోరెల్ సత్తా చాటగా.. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మయాంక్ యాదవ్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. తన స్పీడ్ పవర్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు ఈ 21 ఏళ్ల రైటార్మ్ పేసర్. ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని.. టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ మయాంక్. ఇక తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్- కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో మరో యువ సంచలనం తెర మీదకు వచ్చాడు. విశాఖ సాగర తీరాన పరుగుల సునామీ విశాఖ సాగర తీరాన పరుగుల సునామీ సృష్టించి తన ఆగమాన్ని ఘనంగా చాటాడు. అతడే అంగ్క్రిష్ రఘువంశీ. జూన్ 5, 2005లో.. ఢిల్లీలో జన్మించాడు ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. అండర్ 19 వరల్డ్‌కప్-2023 గెలిచిన భారత జట్టులో సభ్యుడు. Raghuvanshi Ji ke ang ang mein talent hai 🤌#DCvKKR #TATAIPL #IPLonJioCinema #TATAIPLinBhojpuri pic.twitter.com/YKUIw577kD — JioCinema (@JioCinema) April 3, 2024 యశ్ ధుల్ సారథ్యంలో యంగ్ ఇండియాకు ఆడి ఆ ఏడాది ప్రపంచకప్ టోర్నీలో 278 పరుగులు సాధించాడు. తద్వారా భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన అంగ్క్రిష్ రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. వన్‌డౌన్‌లో వచ్చి దుమ్ములేపాడు ఈ నేపథ్యంలో దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్-2024 వేలంలో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని 20 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా అంగ్క్రిష్ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టాడు. అయితే, ఆర్సీబీతో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతడికి అవకాశం వచ్చింది. ఇక డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్ చేసే దక్కించుకున్న అంగ్క్రిష్.. వన్‌డౌన్‌లో వచ్చి ఇరగదీశాడు. నరైన్ ఊచకోత.. అంగ్క్రిష్ విధ్వంసం ఓవైపు సునిల్ నరైన్(39 బంతుల్లో 85) ఢిల్లీ బౌలింగ్‌ను ఊచకోత కోస్తుంటే.. అతడికి తోడుగా మరోవైపు అంగ్క్రిష్ కూడా దుమ్ములేపే ఇన్నింగ్స్ ఆడాడు. 27 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఏకంగా 54 పరుగులు రాబట్టాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అతి పిన్న వయసులో అర్ధ శతకం సాధించిన ఏడో ఆటగాడిగా నిలిచాడు. 18 ఏళ్ల 303 రోజుల వయసులో అంగ్క్రిష్ ఈ ఘనత అందుకున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే యాభై కంటే ఎక్కువ రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో 23వ స్థానం సంపాదించాడు. దేశవాళీ క్రికెట్లో ముంబైకి ఆడుతూ.. ఢిల్లీకి చెందిన అంగ్క్రిష్ రఘువంశీ పదకొండేళ్ల వయసులో ముంబైకి వచ్చాడు. చిన్ననాటి కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ సాయంతో అంచెలంచెలుగా ఎదిగి ముంబై జట్టుకు ఆడే స్థాయికి చేరాడు. 2023లో ముంబై తరఫున లిస్ట్ ఏ, టీ20లలో అరంగేట్రం చేశాడు. సీకే నాయుడు ట్రోఫీ(ఫస్ట్ క్లాస్ క్రికెట్)లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 765 పరుగులతో సత్తా చాటాడు. ఇక కేకేఆర్ తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన అంగ్క్రిష్ రఘువంశీ ఇదే జోరు కొనసాగిస్తే సహచర ఆటగాడు రింకూ మాదిరి.. త్వరలోనే టీమిండియాలోనూ అడుగుపెట్టే అవకాశం దక్కించుకోగలడు. ఆల్ ది బెస్ట్ అంగ్క్రిష్ రఘువంశీ!! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Innovative! Maiden IPL Fifty for Angkrish Raghuvanshi ✨ Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #DCvKKR pic.twitter.com/72oQQZIDbd — IndianPremierLeague (@IPL) April 3, 2024 -
IPL 2024: విశాఖ చేరిన ఆటగాళ్లు.. రేపు ఢిల్లీతో సీఎస్కే మ్యాచ్
విశాఖ స్పోర్ట్స్/గోపాలపట్నం: ఐపీఎల్లో భాగంగా తలపడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ), చైన్నె సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్లు శుక్రవారం సాయంత్రం విశాఖ చేరుకున్నాయి. ఇరు జట్లకు విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. రెండు జట్ల సభ్యులు ప్రత్యేక బస్సుల్లో రోడ్డు మార్గంలో రాడిసన్ బ్లూ హోటల్ వెళ్లారు. పీఎంపాలెంలోని వైఎస్సార్ స్టేడియంలో ఆది వారం ఇరు జట్లు తలపడనుండగా.. శనివారం ప్రాక్టీస్ చేయనున్నాయి. ఈ మ్యాచ్ టికెట్లు హాట్‌కేక్‌లా నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత 17వ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఆర్సీబీ మినహా హోం గ్రౌండ్ జట్లే విజయకేతనం ఎగురవేస్తున్నాయి. డీసీ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. డీసీ విశాఖను తొలి సెషన్ మ్యాచ్‌లకు హోం గ్రౌండ్‌గా ఎంచుకుంది. ఇక డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఇప్పటికే సీఎస్కే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. అయితే ఈ రెండు మ్యాచ్‌లను హోం గ్రౌండ్‌లోనే ఆడి గెలిచింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఇదే ఊపును సీఎస్కే కొనసాగిస్తుందా లేక హోం గ్రౌండ్ సెంటిమెంట్‌తో డీసీ గెలుపునకు శ్రీకారం చుడుతుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మ్యాచ్‌కు అంతా సిద్ధం విశాఖ స్పోర్ట్స్: ఈ నెల 31న డీసీతో తలపడే సీఎస్కే మ్యాచ్‌కు వైఎస్సార్ స్టేడియం సిద్ధమైందని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా పోలీస్ అధికారుల సహకారంతో బీసీసీఐ నిబంధనల మేరకు సర్వం సిద్ధం చేశామన్నారు. ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి నాయకత్వంలో నాలుగేళ్లలో మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించడంతోనే ఐపీఎల్ మ్యాచ్‌లు కేటాయించారన్నారు. ఏసీఏ ఆధ్వర్యంలో క్రీడాకారులు, మ్యాచ్ నిర్వహణ సిబ్బందికి అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు గోపీనాథ్‌రెడ్డి వెల్లడించారు. -
IPL 2024 - Vizag: మార్చి 12 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మరోసారి ఐపీఎల్ సందడి నెలకొననుంది. మార్చి 31, ఏప్రిల్ 3న నిర్వహించనున్న మ్యాచ్‌లకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. తొలి విడత షెడ్యూల్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం హోం గ్రౌండ్‌గా నిలవనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ ఆపరేషన్స్ టీమ్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా అనుమతులు, పారిశుధ్యం, టిక్కెట్ల విక్రయం, పార్కింగ్ తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. అదే విధంగా.. మార్చి 12 నుంచి 19 వరకు వైఎస్సార్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ సభ్యులు ప్రాక్టీసు చేయనున్న నేపథ్యంలో.. ఆ మేరకు స్టేడియంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ ట్రెజరర్ ఏ.వి.చలం, సీఈవో ఎం.వి.శివారెడ్డి, సీఎఫ్ఓ ఎం.నవీన్ కుమార్, జనరల్ మేనేజర్లు ఎం.ఎస్.కుమార్, ఎస్.ఎం.ఎన్.రోహిత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు మార్చి 31: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఏప్రిల్ 3: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ -
Ind vs Eng: విశాఖ టెస్టు.. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ
సాక్షి, విశాఖపట్నం: టీమిండియా – ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌కు నగరంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఫిబ్రవరి 2- 6 వరకు నిర్వహించనున్న ఈ మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేసినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. ఇరు జట్ల ఆటగాళ్లు జనవరి 30న విశాఖపట్నానికి చేరుకుంటారని తెలిపారు. హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 3.25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారని గోపినాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆటగాళ్ల వెంట మ్యాచ్ అధికారులు, ఇతర సిబ్బంది రానున్నట్లు వెల్లడించారు. పనులన్నీ పూర్తి చేయాలి ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణలో భాగంగా స్థానిక స్టేడియంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఏసీఏ ట్రెజరర్ ఎ.వి.చలంతో కలిసి గోపినాథ్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. స్టేడియం లోపల, బయట చేపడుతున్న పనులను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ అదే విధంగా... వాహనాల పార్కింగ్ వద్ద తగిన సిబ్బందిని నియమించి ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని గోపీనాథ్‌రెడ్డి ఆదేశించారు. రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీ ఇవ్వనున్న దృష్ట్యా వారి ఐడీ కార్డులను పరిశీలించి స్టేడియంలోకి పంపాలన్నారు. ఇక విద్యార్థులతో పాటు.. రోజుకు 2,850 మంది చొప్పున.. 5 రోజులకు 14,250 మంది రాష్ట్రంలో ఉన్న క్లబ్ క్రీడా కారులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు ఏసీఏ కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఉప్పల్ మ్యాచ్‌లో రోహిత్ సేన స్టోక్స్ బృందం చేతిలో 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల టెస్టులో 0-1తో వెనుకబడింది. చదవండి: శతక్కొట్టిన బెంగాల్ మంత్రి.. చెలరేగిన షమీ తమ్ముడు -
Ind vs Eng- Vizag: రేపటి నుంచి ఆఫ్‌లైన్ టికెట్లు.. ధరలు ఇలా
సాక్షి, విశాఖపట్నం: టీమిండియా- ఇంగ్లండ్ రెండో టెస్టుకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం(జనవరి 26) నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు టికెట్ల విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 6 వరకు పీఎం పాలెంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం, ఫిబ్రవరి 1 వరకు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్లు విక్రయించనున్నట్లు తెలిపారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టికెట్లు విక్రయించేలా ఏర్పాట్లు చేశామన్నారు. తొలి రోజు టీమిండియాదే కాగా.. ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(జనవరి 25) తొలి టెస్టు ఆరంభమైంది. స్పిన్నర్లు చెలరేగడంతో ఇంగ్లండ్‌ను 246 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడటంతో మొదటి రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. మొత్తానికి తొలి రోజు పర్యాటక స్టోక్స్ బృందంపై రోహిత్ సేన పైచేయి సాధించింది. ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్న టికెట్ల ధరల వివరాలు.. ►రోజుకు రూ.100+సీజన్‌కు రూ.400 ►రోజుకు రూ.200+సీజన్‌కు రూ.800 ►రోజుకు రూ.300+సీజన్‌కు రూ.1,000 ►రోజుకు రూ.500+సీజన్‌కు రూ.1,500 రోజుకు 2,850 మంది క్లబ్ క్రీడాకారులకు ఉచిత ఎంట్రీ.. రాష్ట్రంలో రోజుకు 2,850 మంది క్రికెట్ క్లబ్ క్రీడాకారులన చొప్పున ఐదు రోజులకు 14,250 మందికి ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. రోజుకు 2 వేల మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీ.. రోజుకు 2 వేల మంది చొప్పున ఐదు రోజులకు 10,000 మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీకి ఏర్పాట్లు చేశారు. అయితే విద్యార్థులు ఐడీ కార్డులు తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తక్కువ ధరలు.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా లోయర్ పెవిలియన్ సీజన్ టికెట్లను విశాఖపట్నంలో కేవలం రూ. 1500లకు అందుబాటులో ఉంచినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: INDA& U19 WC: టెస్టులో అన్న.. వరల్డ్‌కప్‌లో తమ్ముడి సెంచరీలు -
Ind Vs Eng- Vizag: టికెట్ల అమ్మకం అప్పటి నుంచే.. వారికి ఫ్రీ ఎంట్రీ
Ind vs Eng 2nd Test 2024: మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు విశాఖపట్నం సిద్దమవుతోంది. టీమిండియా- ఇంగ్లండ్ మ్యాచ్ రూపంలో నాలుగేళ్ల తర్వాత నగరవాసులకు టెస్టు నేరుగా వీక్షించే భాగ్యం కలుగనుంది. కాగా అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో టీ20 సిరీస్ ముగించుకున్న తర్వాత రోహిత్ సేన ఇంగ్లండ్‌తో టెస్టులు ఆడనుంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టుకు విశాఖపట్నం వేదిక కానుంది. నగరంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఫిబ్రవరి 2- ఫిబ్రవరి 6 వరకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు సంబంధించి ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు జరిపేందుకు సన్నాహకాలు జరగుతున్నాయి. జనవరి 15 నుంచి ఆన్లైన్లో.. 26 నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఏసీఏ-వీడీసీ ఏ స్టేడియంతో పాటు స్వర్ణ భారతి స్టేడియంలో ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే విధంగా.. ఈ టెస్టు మ్యాచ్ వీక్షించేందుకు వీలుగా రోజుకు 2 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్టులకు వరుసగా హైదరాబాద్, విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచి, ధర్మశాల ఆతిథ్యం ఇవ్వనున్నాయి. చదవండి: Shreyas Iyer: అందుకే అతడిని సెలక్ట్ చేయలేదు.. కారణం చెప్పిన ద్రవిడ్ -
APL 2022: ప్లేఆఫ్‌నకు కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్
విశాఖ స్పోర్ట్స్ : కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ ఏపీఎల్ తొలి సీజన్ ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. లీగ్ చివరి మ్యాచ్‌లో ఆధిక్యానికి పోటీపడ్డ బెజవాడ టైగర్స్‌ను నిలువరించి కోస్టల్ రైడర్స్ ప్లేఆఫ్‌కు చేరింది. ఇప్పటికే టైగర్స్ ప్లేఆఫ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్లు 12 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్త్‌లు కన్ఫర్మ్ చేసుకున్నాయి. మ్యాచ్ సాగిందిలా! వైఎస్సార్ స్టేడియంలో తొలుత టాస్ గెలిచిన కోస్టల్ రైడర్స్ కెప్టెన్ జ్ఞానేశ్వర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జ్ఞానేశ్వర్‌తో కలిసి తొలి వికెట్‌కు ఓపెనర్ మునీష్ 15 పరుగులు చేసి 23 పరుగుల వద్ద లలిత్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం బరిలో దిగిన హర్షవర్ధన్ కెప్టెన్ జ్ఙానేశ్వర్తో కలిసి పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు నమోదు చేశారు. భారీస్కోర్ దిశగా సాగుతుండగా జ్ఙానేశ్వర్ (52).. రికీబుయ్ బౌలింగ్‌లో డీప్‌మిడ్ వికెట్లో అవినాష్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కీపర్ బ్యాటర్ లేఖజ్తో కలిసి స్కోరును 168 పురుగులకు చేర్చారు. హర్షవర్ధన్ (63) పరుగులు చేసి సాయితేజ బౌలింగ్‌లో సుమంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరో రెండు బంతుల అనంతరం లేఖజ్ (33)అయ్యప్పకు లెగ్‌బిఫోర్‌గా దొరికిపోయాడు. శ్రీనివాస్ (10), తపస్వి(3) అజేయంగా నిలిచి స్కోర్‌ను నాలుగు వికెట్లకు 181 పరుగులకు చేర్చారు. అయ్యప్ప, సాయితేజ, లలిత్, రికీబుయ్ ఒకో వికెట్ తీశారు. తడబడిన టైగర్స్.. దీటుగానే ఆట ప్రారంభించిన బెజవాడ టైగర్స్ తొలి రెండు వికెట్లను కోల్పోయినా తొలి పదిఓవర్లు టాప్ ఆర్డర్ కొనసాగింది. 50 పరుగుల వద్ద ఓపెనర్ సుమంత్ (24), మరో ఓపెనర్ మహీప్ (28) త్వరగా ఔటయ్యారు. 11వ ఓవర్లో ఆశిష్ బౌలింగ్‌లో రెండు వరుస బంతుల్లో కెప్టెన్ రికీబుయ్ (6), మనీష్(0) పెవిలియన్‌కు చేరుకోవడంతో ఒక్కసారిగా ఆటపై కోస్టల్ రైడర్స్ పట్టు సాధించింది. అప్పటి వరకు నిలకడగా ఆడుతున్న ప్రణీత్ సైతం (30)తపస్వి బౌలింగ్‌లో విజయ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరగడంతో వంద పరుగుల మార్కు చేరుకోకుండానే టైగర్స్ జట్టు ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్లో అవినాష్, జగదీష్ జోడి ఇన్నింగ్స్ సరిదిద్ది 54 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. జగదీష్ (27) విజయ్ బౌలింగ్‌లో జ్ఞానేశ్వర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరగ్గా...తొమ్మిది పరుగులు జోడించి రాహుల్ (9),అయ్యప్ప(0)పెవిలియన్‌కు చేరుకున్నారు. మరో రెండు బంతుల్లో ఆట ముగిసే సమయానికి నిలకడగా ఆడుతున్న అవినాష్ (35) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. చివరికి టైగర్స్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రైడర్స్ జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. హర్షవర్ధన్ మ్యాచ్ బెస్ట్ బాటర్గానూ, ఆశీష్ బెస్ట్ బౌలర్‌గా నిలిచారు. రసవత్తర పోరులో ఉత్తరాంధ్ర లయన్స్ విజయం గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయన్స్ జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టైటాన్స్ ఓపెనర్ వంశీకృష్ణ ఒక్క పరుగు చేసి భరత్‌కు దొరికిపోయాడు. ఓపెనర్ హేమంత్‌తో కలిసి నితీష్ రెండో వికెట్‌కు 51పరుగులు జోడించారు. నితీష్ (35) షోయబ్‌కు క్లీన్‌బౌల్డ్ కాగా హేమంత్‌ను (39) 99 పరుగుల వద్ద కౌషిక్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. సందీప్ రెండు ఫోర్లతో 22 పరుగులు చేసి వర్మ బౌలింగ్‌లో లాంగాఫ్‌లో క్రాంతికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ధీరజ్ రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 34పరుగులు చేయడంతో టైటాన్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేయగలిగింది. ప్రమోద్ మూడు, వర్మ రెండు వికెట్లు తీయగా అజయ్, షోయిబ్, కౌషిక్ ఒకో వికెట్ తీశారు. 150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాంధ్ర లయన్స్ ఓపెనర్లు తొలి ఓవర్‌కే 15 పరుగులు చేశారు. ఓపెనర్ రోహిత్ (10)ని నితీష్ తొలి ఓవర్ (ఇన్నింగ్స్ రెండోఓవర్)నాలుగో బంతిని ఆడబోయి స్క్వేర్‌లెగ్‌లో శశికాంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ స్థానంలో వచ్చిన గుల్ఫమ్ నాలుగు పరుగులే చేసి రనౌటై వెనుతిరిగాడు. ఈ దశలో ఓపెనర్, కెప్టెన్ భరత్‌కు ధీరజ్ లక్ష్మణ్ తోడై స్కోర్‌ను 50 పరుగులకు చేర్చారు. భరత్ (36).. ఇస్మాయిల్ వేసిన బంతికి ఎక్స్ట్రా కవర్లో నితీష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ధీరజ్, క్రాంతి జోడి నిలకడగా ఆడుతూ స్కోర్‌ను పరుగులెత్తించారు. థీరజ్ ఏడు ఫోర్లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం బరిలో దిగిన క్రాంతి (17) సైతం సందీప్‌కు క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో చివరి మూడు ఓవర్లలో నాలుగు వికెట్లకు 25పరుగులు చేయాల్సిన స్థితిలో విజయం దోబూచులాడింది. లోయర్ మిడిలార్డర్లో వర్మ 11 పరుగులు చేశాడు. షోయబ్ (6), రఫీ(11) అజేయంగా నిలిచి మరో ఐదు బంతులుండగానే ఏడు వికెట్లకు 150 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించారు. ఇస్మాయిల్ మూడు, సందీప్ రెండు, నితీష్ ఒక వికెట్ తీశారు. దీంతో మూడు వికెట్ల తేడాతో ఉత్తరాంధ్ర లయన్స్ విజయం సాధించింది. మ్యాచ్ బెస్ట్‌గా నితీష్‌కుమార్ నిలవగా బెస్ట్ బ్యాటర్‌గా ధీరజ్, బెస్ట్ బౌలర్‌గా ఇస్మాయిల్ నిలిచారు. చదవండి: Ind Vs Eng 1st ODI: టీమిండియా ఆరేళ్ల తర్వాత.. పాపం ఇంగ్లండ్ సొంతగడ్డపై చెత్త రికార్డు! Latest Womens ODI Rankings: టాప్ 10లో టీమిండియా వైస్ కెప్టెన్.. మెరుగైన కెప్టెన్ ర్యాంక్ -
APL 2022: తడబడిన టైటాన్స్.. గర్జించిన బెజవాడ టైగర్స్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సెంట్రల్ ఆంధ్ర ఫ్రాంచైజీ జట్లు బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. టైటాన్స్ కెప్టెన్ శశికాంత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ వంశీకృష్ణ(10)ను 25 పరుగుల వద్ద అయ్యప్ప క్లీన్‌బౌల్డ్ చేశాడు. 5.5ఓవర్లలో 50పరుగుల మార్కు దాటిన అనంతరం మరో ఓపెనర్ హేమంత్ నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగుల వద్ద లలిత్ బౌలింగ్‌లో అయ్యప్పకు క్యాచ్ఇచ్చి వెనుతిరిగాడు. చివరికి 18.5 ఓవర్లలోనే 119 పరుగులు స్కోర్‌కే టైటాన్స్ ఆలౌటైంది. కెప్టెన్ శశికాంత్ ఒకఫోర్, సిక్సర్‌తో 22 పరుగులు చేయగా నితీష్ 15, సందీప్ 22, ధీరజ్ 10 పరుగులు చేయగలిగారు. అయ్యప్ప ,లలిత్‌మోహన్ మూడేసి వికెట్లు తీయగా సాయిరాహుల్ రెండు, మనీష్, రికీబుయ్ చెరో వికెట్ తీశారు. 120 పరుగుల లక్ష్యంతో... 120 పరుగుల లక్ష్యంతో ఆటను ప్రారంభించిన బెజవాడ టైగర్స్ జట్టు ఓపెనర్ మహీప్ మూడు ఫోర్లతో 20 పరుగులు చేసి 4.4 ఓవర్ల వద్ద వెనుతిరిగాడు. మరో ఓపెనర్ సుమంత్‌కు వన్‌డౌన్‌లో విశాఖకు చెందిన అవినాష్ తోడై స్కోర్‌ను రెండో వికెట్‌కు 84 పరుగులకు చేర్చారు. అవినాష్ రెండు ఫోర్లు,నాలుగు సిక్సర్లతో 46 పరుగులు చేసి వాసు బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. కెప్టెన్ రికీబుయ్ (ఒక ఫోర్, మూడు సిక్సర్స్‌తో)13 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. 17.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి బెజవాడ టైగర్స్ విజయాన్ని అందుకుంది. నితీష్ వేసిన బంతిని స్ట్రయిట్‌గా లాంగ్ఆన్ మీదుగా గాల్లో బౌండరీకి తరలిం సుమంత్ (మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 29 పరుగులు) జట్టుకు విజయాన్ని అందించాడు. లలిత్ ప్లేయర్ ఆఫ్ ది వ్యచ్గా నిలవగా... బెస్ట్ బ్యాటర్‌గా అవినాష్, బెస్ట్ బౌలర్‌గా వాసు నిలిచారు. ఆధిక్యంలో కొనసాగుతున్న టైగర్స్ ఏపీఎల్‌లో ఐదో రోజు మ్యాచ్‌లు ముగిసేప్పటికి బెజవాడ టైగర్స్ మూడు మ్యాచ్‌లాడి 10 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైజాగ్ వారియర్స్ మూడు మ్యాచ్‌లాడి 8 పాయింట్లతో ద్వితీయస్థానంలోకి చేరుకోగా నాలుగు మ్యాచ్‌లాడిన గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయిన్స్, మూడు మ్యాచ్‌లాడిన రాయలసీమ కింగ్స్ 6 పాయింట్లతో కొనసాగుతున్నాయి. కోస్టల్ రైడర్స్ 4 పాయింట్లు సాధించింది. చదవండి: APL 2022: వైజాగ్ వారియర్స్ పరుగుల వరద.. రెండో విజయం! Rohit Sharma- Virat Kohli: కోహ్లికి అండగా నిలిచిన రోహిత్ శర్మ.. అతడు చేసింది కరెక్టే! అయినా కపిల్ దేవ్... -
APL 2022: గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయన్స్ శుభారంభం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) మొదటి సీజన్ బుధవారం ప్రారంభమైంది. వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో గోదావరి టైటాన్స్, కోస్టల్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌ను ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్చంద్ర టాస్ వేసి ప్రారంభించారు. తొలుత స్టేడియంలో ఏసీఏ, ఏపీఎల్ నిర్వాహక బృందాల సమక్షంలో విజేతలకు అందించే ట్రోఫీలను ఆయన ఆవిష్కరించారు. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో వరుణుడు ఆగమనం చేశాడు. దీంతో ఊహించని విధంగా కోస్టల్ రైడర్స్ జట్టు రెండు పరుగుల తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. టాస్ గెలిచిన కోస్టల్ రైడర్స్ కెప్టెన్ జ్ఞానేశ్వర్.. గోదావరి టైటాన్స్ కెప్టెన్ శశికాంత్‌కు బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. శ్రీరాం ఏపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో సూపర్ స్ట్రయికర్‌గా నితీష్‌కుమార్, సూపర్ సిక్సర్‌తో జ్ఞానేశ్వర్, సూపర్ సేవర్‌గా విమల్ కుమార్, బెస్ట్ క్యాచర్‌గా గిరీష్‌కుమార్, బెస్ట్‌గా శశికాంత్ నిలిచి అతిథుల చేతుల మీదుగా అవార్డులందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ కోశాధికారి ఎస్ఆర్ గోపీనాథ్‌రెడ్డి, సీఈవో వీరారెడ్డి, సభ్యుడు రెహ్మాన్, వై.సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలా మొదలైంది.. స్టీఫెన్ వేసిన టోర్నీ తొలి బంతిని ఓపెనర్ హేమంత్ ఎదుర్కొన్నాడు. మూడో బంతికి కవర్ మీదుగా బంతిని పంపి సింగిల్ తీయడంతో గోదావరి టైటాన్స్ పరుగుల ఖాతా ప్రారంభించింది. తర్వాత రెండో బంతిని మరో ఓపెనర్ వంశీకృష్ణ లాంగాఫ్ మీదుగా తరలించడంతో తొలి బౌండరీ నమోదైంది. తొలి ఓవర్(ఆట రెండో ఓవర్) వేస్తున్న హరిశంకర్ రెండో బంతిని ఆడబోయి స్లిప్‌లో ఉన్న శ్రీనివాస్‌కు క్యాచ్ ఇచ్చి హేమంత్(1) వెనుతిరగడంతో టోర్నీలో తొలి వికెట్ నమోదైంది. తొలి నాలుగు వికెట్లను 4.4 ఓవర్లలోనే 21 పరుగుల స్కోర్‌కు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ శశికాంత్‌కు నితీష్(25) తోడై స్కోర్‌ను ముందుకు నడిపారు. 9.3 ఓవర్లలో 50 పరుగుల మార్కు, 18.3 ఓవర్‌కు వంద పరుగుల మార్కును అందుకోగలిగింది. 17.4 ఓవర్లో హరిశంకర్ వేసిన బంతిని ఆడబోయి ధీరజ్(13) హిట్ వికెటై పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి బంతిని డీప్ ఎక్స్ట్రా కవర్ మీదుగా శశికాంత్ బౌండరీకి తరలించడంతో గోదావరి టైటాన్స్ ఆరు వికెట్లకు 115 పరుగులను చేయగలిగింది. శశికాంత్(55) టోర్నీలో తొలి అర్ధ సెంచరీ నమోదు చేసి సాత్విక్(5)తో కలిసి అజేయంగా నిలిచాడు. స్టీఫెన్, హరిశంకర్, దీపక్ రెండేసి వికెట్లు తీశారు. టాస్ గెలిచారు.. మ్యాచ్ ఓడారు.. లక్ష్యం చేరుకునేందుకు కోస్టల్ రైడర్స్ ఇన్నింగ్స్ నిదానంగానే ప్రారంభించారు. శశికాంత్ వేసిన తొలి ఓవర్‌కు కేవలం ఒక పరుగే చేశారు. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ జ్ఞానేశ్వర్ 15 బంతులాడి 20 పరుగులే చేయగా.. మరో ఓపెనర్ ప్రణీత్ 18 బంతులాడి ఏడు పరుగులే చేశాడు. ఓపెనర్ల స్థానంలో వచ్చిన మునీష్ ఆరు బంతులాడి మూడు పరుగులే చేయగా.. తపస్వి మూడు బంతులాడి ఒక పరుగే చేశాడు. ఏడు ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసిన స్థితిలో వరుణుడు ఆగమనం చేశాడు. వర్షం కారణంగా ఆట ముందుకు సాగకపోవడంతో వీజేడీ పద్ధతిలో విజేతను నిర్ణయించేందుకు ఏడు ఓవర్లకు 35 పరుగుల టార్గెట్ విధించారు. దీంతో కోస్టల్ రైడర్స్ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఏపీఎల్ ఆరంభ మ్యాచ్ వరుణుడి రాకతో ఇలా ముగిసింది. గర్జించిన ఉత్తరాంధ్ర లయన్స్ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మరో మ్యాచ్ వర్షం కారణంగా.. 1.45 గంటలు ఆలస్యమైంది. దీంతో 13 ఓవర్ల ఇన్నింగ్స్‌గా నిర్ణయించారు. టాస్ గెలిచిన ఉత్తరాంధ్ర లయన్స్ ఫీల్డింగ్‌ను ఎంచుకుని రాయలసీమ కింగ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు అభిషేక్(30) వంశీకృష్ణ(17) జోడి ధాటిగానే బ్యాటింగ్ చేయడంతో.. 5.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా జట్టు 50 పరుగుల మార్కును చేరింది. తర్వాత రెండు పరుగులు జోడించి ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు. రషీద్ ఐదు నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండి ఐదు బంతులాడి ఐదు పరుగులు చేసి వెనుతిరిగాడు. చివర్లో కీపర్ పృథ్వీ(8) ఓ భారీ సిక్స్ చేసి రనౌటయ్యాడు. కెప్టెన్ గిరినాథ్ 25 పరుగులతో నిలవగా రాయలసీమ కింగ్స్ జట్టు ఏడు వికెట్లకు 99 పరుగులు చేసింది. 100 పరుగుల లక్ష్యంతో ఉత్తరాంధ్ర లయన్స్ బరిలోకి దిగి ఓవర్ మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్నందుకుంది. ఓపెనర్లు గుల్ఫమ్ (30), క్రాంతి(10) తొలి రెండు ఓవర్లు ధాటి గానే ఆడి 21 పరుగులు చేశారు. జట్టు 50 పరుగుల మా ర్కును ఓ వికెట్ కోల్పోయి 6.5 ఓవర్లలో సాధించింది. 10 ఓవర్లు ముగిసేటప్పటికి మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. తరుణ్ 24 పరుగులు చేశాడు. చదవండి: Virat Kohli: ఇదే చివరి అవకాశం.. రిపీట్ అయితే ప్రపంచకప్ జట్టు నుంచి కోహ్లి అవుట్! -
Andhra Premier League: ఏపీఎల్‌లో ఆడే ఆరు జట్ల పేర్లు తెలుసా?
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ తరహాలో రాష్ట్రంలో నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) క్రికెట్ పోటీల ఫ్రాంచైజీ లోగోలను మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ పోటీలు జూలై 6 నుంచి 17వ తేదీ వరకు విశాఖలో జరుగుతాయి. పోటీలకు ఆరు ఫ్రాంచైజీలను ఎంపిక చేశారు. ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించి ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏపీఎల్‌కు శ్రీరాం గ్రూప్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగస్వామ్యం అవుతున్న ఆరు ఫ్రాంచైజీ జట్ల అధినేతలు లోగోలను ఆవిష్కరించారు. క్రికెటర్ల వేలం ఈనెల 24న వైఎస్సార్ స్టేడియంలో జరుగుతుందని ఏసీఏ సీఈవో శివారెడ్డి తెలిపారు. ఏసీఏ కోశాధికారి ఎస్ఆర్ గోపీనాధరెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సత్యప్రసాద్, సభ్యుడు ఆర్వీసీహెచ్ ప్రసాద్, ఆరు ఫ్రాంచైజీల అధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీఎల్‌లో ఆరు జట్లు ఇవే! ►ఉత్తరాంధ్ర లయన్స్ ►రాయలసీమ కింగ్స్ ►గోదావరి టైటాన్స్ ►కోస్టల్ రైడర్స్ ►బెజవాడ టైగర్స్ ►వైజాగ్ వారియర్స్ చదవండి: Rishabh Pant: నేనైతే పంత్ కెప్టెన్ కాకుండా కచ్చితంగా అడ్డుకునేవాడిని! ధోని ఏమో అలా.. కోహ్లి ఇలా! -
విశాఖలో మూడో టీ20: హాట్‌కేకుల్లా అమ్ముడైన ఆన్లైన్ టికెట్లు.. ఆఫ్‌లైన్‌లో కొనాలంటే!
India Vs South Africa 2022 T20 Series- సాక్షి, విశాఖపట్నం: టీమిండియా- దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌కు విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదిక కానుంది. ఈ నెల(జూన్) 14న జరుగనున్న మ్యాచ్ కోసం ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయానికి పెట్టగా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో బుధవారం(జూన్ 8) నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. పీఎం పాలెం క్రికెట్ స్టేడియం, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం, రామ టాకీస్ దగ్గర కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇక భారత్- సౌతాఫ్రికా మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రికెట్ ప్రేమికులు టికెట్ల కోసం క్యూ లైన్లో బారులు తీరారు. మరోవైపు.. మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు భారత్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గురువారం(జూన్ 9) ఇరు జట్ల తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. కేఎల్ రాహుల్ సేన, తెంబా బవుమా బృందం మ్యాచ్ కోసం ఇప్పటికే ప్రాక్టీసు మొదలుపెట్టేశాయి. చదవండి: Ind Vs SA 2022: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా.. పూర్తి షెడ్యూల్, జట్ల వివరాలు! చదవండి: ‘వారి విలువేమిటో బాగా తెలుసు’.. టీమిండియా టాప్–3పై ద్రవిడ్ వ్యాఖ్య చదవండి: Ned Vs WI- Who Is Teja Nidamanuru: అరంగేట్రంలోనే అర్థ శతకంతో మెరిసి.. ఎవరీ తేజ నిడమనూరు?