Ind Vs Eng- Vizag: టికెట్ల అమ్మకం అప్పటి నుంచే.. వారికి ఫ్రీ ఎంట్రీ | Ind vs Eng Test 2024 Vizag Tickets Will Available Online Offline Check Dates | Sakshi
Sakshi News home page

Ind Vs Eng- Vizag: గుడ్‌న్యూస్‌.. మ్యాచ్‌ టికెట్ల అమ్మకం అప్పటి నుంచే! వారికి ఫ్రీ ఎంట్రీ

Published Thu, Jan 11 2024 6:33 PM | Last Updated on Thu, Jan 11 2024 7:11 PM

Ind vs Eng Test 2024 Vizag Tickets Will Available Online Offline Check Dates - Sakshi

Ind vs Eng 2nd Test 2024: మరో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు విశాఖపట్నం సిద్దమవుతోంది. టీమిండియా- ఇంగ్లండ్‌ మ్యాచ్‌ రూపంలో నాలుగేళ్ల తర్వాత నగరవాసులకు టెస్టు నేరుగా వీక్షించే భాగ్యం కలుగనుంది. కాగా అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో టీ20 సిరీస్‌ ముగించుకున్న తర్వాత రోహిత్‌ సేన ఇంగ్లండ్‌తో టెస్టులు ఆడనుంది.

ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టుకు విశాఖపట్నం వేదిక కానుంది. నగరంలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో ఫిబ్రవరి 2- ఫిబ్రవరి 6 వరకు ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది.

ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు జరిపేందుకు సన్నాహకాలు జరగుతున్నాయి. జనవరి 15 నుంచి ఆన్‌లైన్‌లో.. 26 నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఏసీఏ-వీడీసీ ఏ స్టేడియంతో పాటు స్వర్ణ భారతి స్టేడియంలో ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అదే విధంగా.. ఈ టెస్టు మ్యాచ్‌ వీక్షించేందుకు వీలుగా రోజుకు 2 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. కాగా టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య జరిగే ఐదు టెస్టులకు వరుసగా హైదరాబాద్‌, విశాఖపట్నం, రాజ్‌కోట్‌, రాంచి, ధర్మశాల ఆతిథ్యం ఇవ్వనున్నాయి.  

చదవండి: Shreyas Iyer: అందుకే అతడిని సెలక్ట్‌ చేయలేదు.. కారణం చెప్పిన ద్రవిడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement