న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా ఒడిశాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒడిశా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 184 పరుగులు చేసింది. సుజిత్ (55; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఆంధ్ర బౌలర్లలో కరణ్ శర్మ (3/29), మనీశ్ (2/29), షోయబ్ (2/32) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ఆంధ్ర 47.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ అశ్విన్ హెబర్ (130 బంతుల్లో 92 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), డీబీ రవితేజ (53 నాటౌట్; 7 ఫోర్లు) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించారు. కేఎస్ భరత్ (0), రికీ భుయ్ (0) డకౌట్ కాగా.. కెప్టెన్ హనుమ విహారి (9) విఫలమయ్యాడు.
8 మంది ఆటగాళ్లపై సస్పెన్షన్...
దేశవాళీ క్రికెట్‌లో తొలిసారి అడుగు పెట్టిన పుదుచ్చేరి జట్టుకు తొలి సీజన్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన కారణంగా ఆ జట్టుకు చెందిన 8 మంది ఆటగాళ్లపై బీసీసీఐ అనర్హత వేటు వేసింది.
ఆంధ్ర మరో విజయం
Published Fri, Sep 21 2018 1:18 AM | Last Updated on Fri, Sep 21 2018 1:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment