IPL 2022: CSK call up Odishas Subhranshu Senapati for selection trials - Sakshi
Sakshi News home page

IPL 2022: ఒడిశా ఆటగాడికి బంఫర్‌ ఆఫర్‌.. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు!

Published Sun, Dec 19 2021 3:30 PM | Last Updated on Sun, Dec 19 2021 6:08 PM

IPL 2022: CSK call up Odishas Subhranshu Senapati for selection trials - Sakshi

ఒడిశా ఆటగాడు సుభ్రాంశు సేనాపతికి బంఫర్‌ ఆఫర్‌ తగిలింది. ఢిపిండింగ్‌ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వచ్చే సీజన్‌కు ముందు ట్రయల్స్ కోసం ఒడిశా బ్యాటర్ సుభ్రాంశు సేనాపతికి పిలుపునిచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో సుభ్రాంశు సేనాపతి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన 7మ్యాచ్‌ల్లో 275 పరుగులు సాధించాడు. ఈ టోర్నీలో ఒడిశా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

అంతేకాకుండా అంతకుముందు జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ ఆలీ ట్రోఫీలోను అద్బుతంగా రాణించాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన సేనాపతి 138 పరుగులు సాధించాడు. ఇక సీఎస్కే విషయానికి వస్తే.. ఐపీఎల్‌-2022  మెగా వేలానికి ముందు నలుగురు ఆటగాళ్లను రీటైన్‌ చేసుకుంది. జట్టులో అత్యధికంగా రవీంద్ర జడేజాను 16 కోట్లకు రిటైన్ చేసుకుంది. కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని 12 కోట్లకు,  ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ, భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌లను 8 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది.

చదవండి: Ashes Series 2021: వార్నర్‌ నువ్వు గ్రేట్‌.. నొప్పి బాదిస్తున్నా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement