సౌత్‌జోన్‌ క్రికెట్‌ విజేతగా కడప జట్టు | Sautjon cricket team is the winner of the Kadapa | Sakshi
Sakshi News home page

సౌత్‌జోన్‌ క్రికెట్‌ విజేతగా కడప జట్టు

Published Sat, Oct 22 2016 10:19 PM | Last Updated on Sat, Jun 2 2018 2:19 PM

సౌత్‌జోన్‌ క్రికెట్‌ విజేతగా కడప జట్టు - Sakshi

సౌత్‌జోన్‌ క్రికెట్‌ విజేతగా కడప జట్టు

 కడప స్పోర్ట్స్‌ :  కడప నగరం కేఎస్‌ఆర్‌ఎం క్రీడామైదానంలో గత మూడురోజులుగా నిర్వహిస్తున్న సౌత్‌జోన్‌ అంతర్‌ జిల్లాల  దివ్యాంగుల క్రికెట్‌ విజేతగా కడప జట్టు నిలిచింది. శనివారం నిర్వహించిన ఫైనల్‌మ్యాచ్‌లో అనంత జట్టుపై విజయం సాధించి విజేతగా నిలిచింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి, కందుల విద్యాసంస్థల కరస్పాండెంట్‌ శివానందరెడ్డి, టీడీపీ నాయకుడు దుర్గాప్రసాద్‌లు విచ్చేసి విన్నర్స్‌కు, రన్నర్స్‌కు, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ట్రోఫీలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగులు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరన్నారు. అన్ని రంగాలతో పాటు క్రీడారంగంలో కూడా రాణించడం అభినందనీయమన్నారు.  అనంతరం విజేతగా నిలిచిన కడప జట్టుకు విన్నర్స్‌ ట్రోఫీ, రన్నరప్‌గా నిలిచిన అనంత జట్టుకు రన్నర్స్‌ ట్రోఫీ అందజేశారు. మ్యాన్‌ఆఫ్‌ ది మ్యాచ్‌గా సుబ్బరాయుడు (కడప), మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్, బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా హుదా (అనంతపురం), బెస్ట్‌ బౌలర్‌గా అంజినాయుడు (చిత్తూరు)లకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో  వికలాంగుల క్రికెట్‌ సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ,  కార్యదర్శి రామాంజుల నాయక్, వికలాంగుల సంక్షేమ సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అనంతపై కడప విజయభేరి..
శనివారం నిర్వహించిన ఫైనల్‌మ్యాచ్‌లో కడప, అనంత జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. జట్టులోని రోశిరెడ్డి 60, హుదా 33 పరుగులు చేశారు. కడప బౌలర్లు క్రాంతి, సుబ్బరాయుడు, అశోక్, అంజి తలాఒక వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 19  ఓవర్లలోనే 8 వికెట్ల నష్టానికి 133 పరుగుల విజయలక్ష్యం చేధించి విజేతగా నిలిచింది. జట్టులోని సుబ్బరాయుడు 45, వెంకటయ్య 24, అంజి 10 పరుగులు చేశారు. అనంత బౌలర్లు రామకృష్ణ 2, హుదా 2 వికెట్లు తీశారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే సౌత్‌జోన్‌ జట్టును ప్రకటించారు.
సౌత్‌జోన్‌ జట్టు:
 అంజినాయుడు (కెప్టెన్‌ చిత్తూరు), క్రాంతికుమార్,  సుబ్బరాయుడు (కడప), నూరుల్లాహుదా, రోశిరెడ్డి (అనంతపురం), ఇ. అశోక్‌ (కడప), పురుషోత్తం (చిత్తూరు), లక్ష్మణ్‌  (కర్నూలు), రహీం (కర్నూలు), మనోహర్‌ (నెల్లూరు), భాస్కర్‌ (అనంతపురం), నాగరాజు (చిత్తూరు), రఫీక్‌ (కర్నూలు), వేదా (కడప), వెంకటేష్, రవి (అనంతపురం), జావిద్‌ (కడప).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement