సాక్షి, అమరావతి, విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా హైకోర్టు ఉత్తర్వుల కారణంగా ఫలితాలను ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. వివరాల్లోకెళితే... మాజీ ఐఏఎస్ రమాకాంత్ రెడ్డి ఎన్నికల అధికారిగా నవంబర్ 18న ఏసీఏ ఎన్నికలు నిర్వహించారు.
ఇందులో ఆరు కీలక పదవుల కోసం ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో వీరందరూ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వీటిని ఈనెల 3న ప్రకటించాల్సి ఉండగా... చిత్తూరు జిల్లా క్రికెట్ సంఘం హైకోర్టులో కేసు వేయడంతో ఫలితాలను నిలిపేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే తాజాగా చిత్తూరు జిల్లా సంఘం కేసును వెనక్కి తీసుకోవడంతో అడ్డంకి తొలగింది.
దాంతో ఫలితాలను ప్రకటించేందుకు న్యాయమూర్తి జస్టిస్ సి.మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఎన్నికల్లో అధ్యక్షుడిగా పి. శరత్ చంద్రారెడ్డి... ఉపాధ్యాక్షుడిగా పి.రోహిత్ రెడ్డి... కార్యదర్శిగా గోపీనాథ్ రెడ్డి... సంయుక్త కార్యదర్శిగా ఎ.రాకేశ్... కోశాధికారిగా ఎ.వెంకటాచలం... కౌన్సిలర్‌గా కేవీ పురుషోత్తమ రావు ఎన్నికయ్యారు.
చదవండి: FIFA WC2022: ఫ్రాన్స్ చేతిలో చిత్తు.. బ్రస్సెల్స్‌లో మొరాకో అభిమానుల విధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment