sarath chandra reddy
-
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి
సాక్షి, అమరావతి, విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా హైకోర్టు ఉత్తర్వుల కారణంగా ఫలితాలను ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. వివరాల్లోకెళితే... మాజీ ఐఏఎస్ రమాకాంత్ రెడ్డి ఎన్నికల అధికారిగా నవంబర్ 18న ఏసీఏ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఆరు కీలక పదవుల కోసం ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో వీరందరూ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వీటిని ఈనెల 3న ప్రకటించాల్సి ఉండగా... చిత్తూరు జిల్లా క్రికెట్ సంఘం హైకోర్టులో కేసు వేయడంతో ఫలితాలను నిలిపేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే తాజాగా చిత్తూరు జిల్లా సంఘం కేసును వెనక్కి తీసుకోవడంతో అడ్డంకి తొలగింది. దాంతో ఫలితాలను ప్రకటించేందుకు న్యాయమూర్తి జస్టిస్ సి.మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఎన్నికల్లో అధ్యక్షుడిగా పి. శరత్ చంద్రారెడ్డి... ఉపాధ్యాక్షుడిగా పి.రోహిత్ రెడ్డి... కార్యదర్శిగా గోపీనాథ్ రెడ్డి... సంయుక్త కార్యదర్శిగా ఎ.రాకేశ్... కోశాధికారిగా ఎ.వెంకటాచలం... కౌన్సిలర్‌గా కేవీ పురుషోత్తమ రావు ఎన్నికయ్యారు. చదవండి: FIFA WC2022: ఫ్రాన్స్ చేతిలో చిత్తు.. బ్రస్సెల్స్‌లో మొరాకో అభిమానుల విధ్వంసం -
ఆంధ్ర క్రికెటర్లు భారత జట్టులోకి ఎంపికవ్వాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడుతున్న యువ ఆటగాళ్లు భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి ఆకాంక్షించారు. యువ క్రికెటర్లలను ప్రోత్సహించడంలో, వారికి తగిన అవకాశాలు ఇవ్వడంతో ఏసీఏ ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు. ఏసీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్ర టి20 లీగ్‌ను ఆయన ఆర్డీటీ మైదానంలో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ నవంబర్ 8 వరకు జరుగుతుంది. మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. తొలి రోజు మ్యాచ్‌ల్లో కింగ్స్ ఎలెవన్‌పై 6 వికెట్లతో టైటాన్స్ ఎలెవన్ గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో చార్జర్స్ ఎలెవన్ జట్టు 56 పరుగులతో లెజెండ్స్ ఎలెవన్‌ను ఓడించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏసీఏ రాష్ట్ర కార్యదర్శి దుర్గాప్రసాద్, సీఈఓ వెంకటశివారెడ్డి, ట్రెజరర్ గోపీనాథ్‌రెడ్డి, అండర్–14 ఆంధ్ర జట్టు సెలెక్టర్ ప్రసాద్‌రెడ్డి, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, మాజీ క్రికెటర్ షాబుద్దీన్ తదితరులు హాజరయ్యారు. -
కొలువుదీరిన ఏసీఏ కార్యవర్గం
విజయవాడ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యవర్గం శుక్రవారం బాధ్యతలు స్వీకరించింది. ఏసీఏ అధ్యక్షుడిగా పి.శరత్‌చంద్రా రెడ్డి, ఉపాధ్యక్షుడిగా వీవీఎస్‌ఎస్‌కే యాచేంద్ర, కార్యదర్శిగా వి.దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా కేఎస్ రామచంద్రరావు, కోశాధికారిగా జి.గోపినాథ్‌రెడ్డి, కౌన్సిలర్‌గా ఆర్.ధనుంజయరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో ఈ ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తరపున ఏసీఏ లీగల్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరాజు అధికారికంగా ఈ ఎంపికను ప్రకటించి సరి్టఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఆఫీస్‌బేరర్లు గోకరాజు రంగరాజు, సీహెచ్.అరుణ్‌కుమార్ కొత్త కమిటీకి స్వాగతం పలికారు. తమ హయాంలో జరిగిన ఏసీఏ అభివృద్ధిని తెలిపిన వీరు కొత్త కమిటీ దీనిని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇటీవలే రిటైరైన టీమిండియా మాజీ ఆటగాడు వై.వేణుగోపాలరావును కొత్త కార్యవర్గం ఘనంగా సన్మానించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నట్లు ఈ సందర్భంగా వేణుగోపాలరావు అన్నాడు. ఆంధ్ర నుంచి ఎక్కువ మంది దేశానికి ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ... క్షేత్ర స్థాయిలో క్రికెట్‌ను అభివృద్థి చేస్తామన్నారు. బా«ధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, పారదర్శకత పాటిస్తామని పేర్కొన్నారు. మిగిలిన కార్యవర్గం ప్రతినిధులు మాట్లాడుతూ, తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శభాష్ అనిపించుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పాల్గొన్నారు. -
హోదా కోసం కలిసికట్టుగా పోరాడుదాం
నెల్లూరు(సెంట్రల్): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కలిసికట్టుగా పోరాడుదామని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పార్థసారధి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం మాగుంట శరత్‌చంద్రారెడ్డి యువజన సేవా సమితి ఆ«ధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటరులో శుక్రవారం చేపట్టిన ఒక్క రోజు నిరాహార దీక్షకు వారు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. హోదా సాధించేందుకు కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ దీక్షల్లో సమితి సభ్యులు సాయి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.