సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో గత 4 నెలల నుండి చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడుని మెగాస్టార్ చిరంజీవి గారు పరామర్శించిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పడమే కాకుండా, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చేశారు. ఆయన ఆరోగ్యం కుదుటపడి కోలుకోవడంతో మెగాస్టార్‌ను కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి శనివారం రామ్మోహన్ నాయుడు చిరంజీవి ఇంటికి వెళ్ళారు. చిరంజీవిని కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘నేను ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పాల్గొన్నాను. గత నాలుగు నెలల నుండి నాకు ఆరోగ్యం బాగాలేదు. కరీంనగర్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. మొదట జాండిస్ అన్నారు...కానీ ఆ ట్రీట్మెంట్ లో చాలా వీక్ అయ్యాను, మనుషులను కూడా గుర్తుపట్టలేదు. ఇడ్లీ లో సగంకుడా తినలేని పరిస్తితికి వెళ్ళాను. మొత్తానికి అక్కడనుండి హైదరాబాద్ వచ్చాను, నా అనారోగ్యం గురించి చిరంజీవి తెలుసుకుని నన్ను ఇంటి నుంచి ఆసుపత్రిలో చేర్పించారు. నిజంగా ఇది నాకు పునర్జన్మ లాంటిది. చిరంజీవి నా అనారోగ్యం గురించి తెలుసుకుని, ఆయన స్వయంగా మా ఇంటికి వచ్చి పరామర్శించారు. అక్కడి వైద్యలు, చిరంజీవి గారి వల్లనేను పూర్తిగా కొలుకున్నాను. చిరంజీవి లేకుంటే నా పరిస్థితి ఏమై పోయేదో. ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ కు నా జన్మంతా రుణపడి ఉంటాను, అలాగే స్వామి నాయుడు, మెగా ఫ్యాన్స్ కు కూడా నా ధన్యవాదాలు’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment