పాతపట్నం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దమ్ము, ధైర్యం ఉంటే మాట్లాడిన మాటలు నిరూపించాలని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి సవాల్ విసిరారు. ఆమె మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కలమట వెంకటరమణ రాసిన స్క్రి ప్టు లేకపోవడంతో పవన్ కళ్యాణ్ బంటులు రాసి న స్క్రిప్ట్‌నే లోకేష్ చదివారని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరో పణలు చేయడం కాదని, దమ్ము, ధైర్యం ఉంటే నిరూపించాలన్నారు. లోకేష్ మతి భ్రమించి మా ట్లాడుతున్నాడని, లోకేష్‌ను హైదరాబాద్ ఎర్రగెడ్డ మెంటల్ ఆస్పత్రిలో జాయిన్ చేయాలని అన్నా రు.
2014–19 కాలంలో అవినీతి అక్రమాలు జరిగినందు వల్లే మిమ్మల్ని జనం తరిమికొట్టారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వైఎస్ జగన్ భిక్షతో గెలిచి టీడీపీలోకి జంప్ అయ్యారని, చంద్రబాబే కొనుగోలు చేశార ని గుర్తు చేశారు. కలమట, ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల పేరు తో, ప్రజలను హింస పెట్టారని గుర్తు చేశారు. అందుకే ప్రజలు మీకు బుద్ధి చెప్పారని అన్నారు. కలమట అక్రమ వ్యాపారాల్లో రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడుకు కూడా వాటాలు ఉన్నాయన్నారు.
జగనన్న రాజ్యంలో ప్రజలకు సంక్షేమ పథకాలు చక్కగా అందిస్తున్నామని చెప్పారు. కాగువాడ–రొమదల మధ్య మహేంద్రతనయ నదిపై వంతెన మా హయాంలో జరిగితే ఎంపీ తన ఖాతాలో వేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో ఎంపీపీ దొర సావిత్రమ్మ, పీఏసీఎస్ అధ్యక్షుడు ఎం.శ్యామ్‌సుందరావు, పార్టీ మండల అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్, ఎంఎస్‌ఎం రాష్ట్ర డైరెక్టర్ వై.వెంకటరమణ, పార్టీ వీవర్స్ జిల్లా అధ్యక్షుడు మంచు చంద్రయ్య, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జి.అప్పన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం.తాతయ్య, నాయకులు బి.నారాయణమూర్తి, గేదెల సూర్యం, పనుకు మోహన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment