Sudheer Babu Reacts to Mahesh Babu Tweet On Sridevi Soda Center - Sakshi
Sakshi News home page

Sudheer Babu-Mahesh Babu: ‘బెదిరించినా సరే మహేశ్‌ అలా చేయరు’

Published Sun, Aug 29 2021 8:06 AM | Last Updated on Sun, Aug 29 2021 3:35 PM

Sudheer Babu About Mahesh Babu Reaction On Sridevi Soda Center - Sakshi

‘‘మా సినిమా చూసిన ప్రేక్షకులకు సూరిబాబు, శ్రీదేవి పాత్రలు గుర్తుండిపోతాయి. చూసినవాళ్లందరూ బాగుందని అభినందిస్తున్నారు. మహేశ్‌ (హీరో మహేశ్‌బాబు) అనే వ్యక్తికి రెండొందల కోట్లు ఇచ్చినా, బెదిరించినా సరే తను నమ్మనిదే తన కెరీర్‌లో ఏమీ చేయడు. మా ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ని అభినందిస్తూ ఆయన ట్వీట్‌ చేశాడు’’ అన్నారు సుధీర్‌బాబు. కరుణ కుమార్‌ దర్శకత్వంలో సుధీర్‌బాబు, ఆనంది జంటగా విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ‘శ్రీదేవి సోడా సెంటర్‌‘ ఆగస్ట్‌ 27న విడుదలైంది.

ఈ సందర్భంగా కరుణ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి మా సినిమా నిరూపించింది. మహిళలందరూ చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘మంచి కంటెంట్‌తో తీసిన మా సినిమాకు అభినందనలు దక్కుతున్నాయి. ఇంకా థియేటర్స్‌ పెంచుతున్నాం’’ అన్నారు విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి. 

చదవండి : ‘శ్రీదేవీ సోడా సెంటర్’పై మహేశ్‌ బాబు రివ్యూ
Sridevi Soda Center Review: శ్రీదేవి సోడా సెంటర్‌ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement