‘‘సినిమా సినిమాకు మేం గ్యాప్ తీసుకోవడం లేదు. మంచి కథ కుదిరితేనే సినిమా చేస్తాం. కథలు వినడమే మా పని. కథ నచ్చితే పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి. సుధీర్‌బాబు, ఆనంది జంటగా కరుణకుమార్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.
(చదవండి: ఒక్క రోజు లేట్ అయితే చచ్చిపోయేవాడ్ని.. చిరంజీవి కాపాడాడు : బండ్ల గణేశ్)
ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసిన రోజే మెయిన్ కెమెరా పడిపోయింది. లక్కీగా కెమెరాకు ఏం కాలేదు. తర్వాతి రోజు క్యారవ్యాన్ అసిస్టెంట్‌కు షాక్ కొట్టి గాయపడ్డాడు. ఆ నెక్ట్స్ రోజు క్యారవాన్ ఓ గోతిలో ఇరుక్కుపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా నా బ్రదర్ (విజయ్ చిల్లా సోదరుడు)ను కోల్పోయాను. దాదాపు నెల రోజులు బ్రేక్ తీసుకుని షూట్‌ను స్టార్ట్ చేశాం. ఈ రూరల్ లవ్‌స్టోరీలో సుధీర్‌బాబు, ఆనంది బాగా చేశారు. గ్రామీణ రాజకీయాలు, కులాల ప్రస్తావన వంటి అంశాలను ఎలా డీల్ చేశామన్నది వెండితెరపై చూడాలి. ఈ చిత్రానికి మణిశర్మగారు మంచి సంగీతం అందించారు. మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన వెంటనే మా సినిమాకు బజ్ స్టార్ట్ అయ్యింది. అలాగే గ్లింప్స్ విడుదల చేశాక బిజినెస్ ఊపందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 థియేటర్స్‌లో, ఓవర్‌సీస్‌లో 120 థియేటర్స్‌లో సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేశాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment