Mani Sharma Son Mahati marriage Photos - Sakshi
Sakshi News home page

Mani Sharma: ఘనంగా మణిశర్మ కొడుకు వివాహం

Published Mon, Oct 25 2021 11:20 AM | Last Updated on Mon, Oct 25 2021 1:09 PM

Mani Sharma Son Mahati Got Married To Sanjana Photos Viral - Sakshi

Mani Sharma Son Mahati Got Married To Sanjana: ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ వివాహం ఘనంగా జరిగింది. గాయని సంజన కలమంజేతో ఆదివారం చెన్నైలోని టీ-నగర్‌లోని ద అకార్డ్‌ ఫంక్షన్‌ హాల్‌లో వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఈ వేడుకకు బంధుమిత్రులు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో మహతి-సంజనల నిశ్చితార్థం జరగ్గా, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

ఛలో, భీష్మ, మ్యాస్ట్రో సినిమాలకు మహతి సంగీతం అందించగా.. సంజన భీష్మ సినిమాలోని ‘హేయ్‌ చూసా’  పాటకు గాత్రం అందించారు. అంతేకాకుండా పలు తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా ఆమె పాటలు పాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement