Sagar Mahati
-
ఘనంగా మణిశర్మ కొడుకు వివాహం.. ఫోటోలు వైరల్
Mani Sharma Son Mahati Got Married To Sanjana: ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ వివాహం ఘనంగా జరిగింది. గాయని సంజన కలమంజేతో ఆదివారం చెన్నైలోని టీ-నగర్‌లోని ద అకార్డ్ ఫంక్షన్ హాల్లో వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఈ వేడుకకు బంధుమిత్రులు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో మహతి-సంజనల నిశ్చితార్థం జరగ్గా, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఛలో, భీష్మ, మ్యాస్ట్రో సినిమాలకు మహతి సంగీతం అందించగా.. సంజన భీష్మ సినిమాలోని ‘హేయ్ చూసా’ పాటకు గాత్రం అందించారు. అంతేకాకుండా పలు తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా ఆమె పాటలు పాడారు. -
ఘనంగా మణిశర్మ కుమారుడి నిశ్చితార్థం ఫోటోలు
-
మణిశర్మ కుమారుడి నిశ్చితార్థం.. వైరలవుతోన్న ఫోటోలు
ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు స్వరసాగర్ మహతి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. సంజన కలమంజే అనే యువతితో ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది బంధువుల సమక్షంలో ఈ వేడుక అత్యంత సాధారణంగా జరిగింది. అయితే సాగర్ తన నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవరకు ఈ విషయం ఎక్కవ మందికి తెలియదు. చదవండి: కొత్త ఫ్లాట్ తీసుకున్న చై, అక్కడే ఒంటరిగా.. ఇక సాగర్ మహతి పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా గాయని కావడం విశేషం. ఆమె పలు తమిళ, కన్నడ చిత్రాల్లో పాటలు పాడారు. అంతేగాక సాగర్ మ్యూజిక్ డైరెక్ట్ చేసిన భీష్మ సినిమాలోని ‘హేయ్ చూసా’ అనే పాటకు గాత్రం అందించారు. ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: ఫ్యామిలీతో స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న మహేశ్ అయితే సాగర్- సంజనల పెళ్లి తేదిని ఇంకా ఖరారు చేయనట్లు తెలుస్తోంది. కాగా మణిశర్మ కుమారుడు సాగర్ మహతి కూడా సంగీత దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన ‘ఛలో, భీష్మ, మ్యాస్ట్రో’ వంటి చిత్రాలకు సంగీతం అందించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అలాగే తన తండ్రి పని చేసే చిత్రాలకు సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. -
నాన్నగారి పాటల్లా ఉన్నాయంటున్నారు!
‘‘నాకు చిన్నతనం నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. మా తాతగారు వైయన్ శర్మ ప్రముఖ సంగీత వాద్యకళాకారుడు. ఇక మా నాన్న గారు మణిశర్మ గురించి అందరికీ తెలుసు. అలా వారిద్దరి ప్రభావంతోనే నాలో సంగీతాభిలాష ఇంకా పెరిగింది’’ అన్నారు సాగర్ మహతి. ప్రముఖ సంగీత దర్శకుడు మణి శర్మ కుమారుడు సాగర్ మహతి ‘జాదూగాడు’ చిత్రంతో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేస్తు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘కీబోర్డ్ ప్లేయర్‌గా, ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్న నాకు ఈ సినిమాకు పనిచేసే అవకాశం దర్శకుడు యోగి గారి వల్లే వచ్చింది. నా తొలి సినిమా పాటలకు మంచి స్పందన వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా మీద కచ్చితంగా మా నాన్నగారి ప్రభావం 80 శాతం వరకూ ఉంది. మిగతా 20 శాతం సంగీత దర్శకుడు కల్యాణ్ మాలిక్ గారిదే. నేను ఆయన దగ్గర చాలా సినిమాలకు పనిచేశాను. ఈ సినిమాకు పనిచేస్తున్నపుడు నాన్నగారికి నా ట్యూన్స్ వినిపించేవాణ్ణి. ఆయనిచ్చిన సలహాలు బాగా ఉపయోగపడ్డాయి. నా పాటలు విన్న ప్రతి ఒక్కరూ అచ్చం నాన్నగారి పాటల్లానే ఉన్నాయంటున్నారు. దాన్ని బెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నా. ప్రస్తుతం ఎస్.వి.కె బ్యానర్లో మధు దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రానికి స్వరాలందిస్తున్నా. మ్యూజిక్‌తో ఎంటర్టైన్ చేయడమే నా లక్ష్యం’’ అని చెప్పారు.