ఇంద్రాణి ట్రైలర్‌ బాగుంది | Indrani trailer launched grandly | Sakshi
Sakshi News home page

ఇంద్రాణి ట్రైలర్‌ బాగుంది

Published Mon, Feb 19 2024 3:02 AM | Last Updated on Mon, Feb 19 2024 3:02 AM

Indrani trailer launched grandly - Sakshi

మణిశర్మ, యానియా భరద్వాజ్‌

‘‘ఇంద్రాణి’ సినిమా ట్రైలర్‌ చాలా బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. సాయి కార్తీక్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. సరికొత్త కథాంశంతో రూపొందిన ‘ఇంద్రాణి’ చిత్రం విజయం సాధించాలి’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు. యానియా భరద్వాజ్, కబీర్‌ దుహాన్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇంద్రాణి’. స్టీఫెన్‌ పల్లం దర్శకత్వంలో వెరోనికా ఎంటర్‌టైన్ మెంట్స్‌పై స్టాన్లీ సుమన్‌ బాబు నిర్మించారు.

సుధీర్‌ వేల్పుల, ఓఓ రెడ్డి, జైసన్, కేకే రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీ ఏప్రిల్‌ 5న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ– ‘‘అమెరికాలో ఉంటూ ఇక్కడ సినిమా నిర్మించడం ఎంత కష్టమో నాకు తెలుసు.

సినిమా మీద ఫ్యాషన్‌ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ‘ఇంద్రాణి’ విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘అన్ని వాణిజ్య అంశాలున్న సైన్స్ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. రాబోయే 50 సంవత్సరాల్లో ఇండియా సాంకేతిక పరంగా ఎంత ముందుంటుంది? అనేది ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు స్టీఫెన్‌ పల్లం. ఈ వేడుకలో చిత్ర సంగీత దర్శకుడు సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్‌: స్టాన్లీ పల్లం, కెమెరా: చరణ్‌ మాధవనేని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement